https://oktelugu.com/

చంద్రబాబుకు ‘కరోనా’ భయం

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. తాజాగా ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. కరోనా వ్యాధికి సంబంధించి స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దాంతో ఆయన హోంక్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు. ‘అందరికీ నమస్కారం. ఈ రోజు నేను కోవిడ్ టెస్ట్ చేయించుకోగా […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 6, 2021 / 02:44 PM IST
    Follow us on


    ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. తాజాగా ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. కరోనా వ్యాధికి సంబంధించి స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దాంతో ఆయన హోంక్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు. ‘అందరికీ నమస్కారం. ఈ రోజు నేను కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ఆరోగ్యంగానే ఉన్నాను. హోం క్వారంటైన్ లో విశ్రాంతి తీసుకుంటున్నాను. ఇటీవల నన్ను కలిసినవారందరూ తగు జాగ్రత్తలు తీసుకోగలరు’ అంటూ సోమిరెడ్డి ట్వీట్ చేశారు.

    Also Read: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం..: జగన్‌ వైఖరి అలానే ఉందట

    అయితే.. సోమిరెడ్డి ఇటీవల వరుస ప్రజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో ఆయనకు కరోనా సోకినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో చంద్రబాబు సహా మొత్తం టీడీపీ సీనియర్‌‌ నాయకులంతా ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే.. రెండు రోజుల ముందే సోమిరెడ్డి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అందులో చాలా మంది నేతలకు దగ్గరగా ఉండిపోయారు.

    ముఖ్యంగా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిన్న విజయవాడలో జరిగింది. స్వయంగా సోమిరెడ్డి బెజవాడలోని తన నివాసంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అచ్చెన్నాయుడు అధ్యక్షతన ఈ మీటింగ్‌ జరిగింది. ఇందులో పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. దానికి సంబంధించిన ఫొటోను కూడా సోమిరెడ్డి పోస్ట్ చేశారు. మొన్న సోమవారం టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో చంద్రబాబు, అచ్చెన్నాయుడుతో పాటు చాలామంది టీడీపీ ప్రముఖులు పాల్గొన్నారు.

    Also Read: ఎన్టీఆర్‌‌ జిల్లాలో వైఎస్‌ఆర్‌‌ మున్సిపాల్టీ ఏంటి..? : పెదవి విరుస్తున్న ప్రజలు

    దీంతో ఇప్పుడు టీడీపీ నేతల్లో గందరగోళం నెలకొంది. సోమిరెడ్డికి పాజిటివ్ అని తెలిసిన వెంటనే అచ్చెన్నాయుడుతో పాటు టీడీపీ నేతలంతా తమ సమావేశాలు, కార్యక్రమాలు రద్దుచేసుకున్నారు. అందరూ కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. హోమ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్