కరోనా క్రిటికల్: ఆస్పత్రిలో చేరిన కేటీఆర్, సంతోష్?

సీఎం కేసీఆర్ కు వెన్నంటి నీడలా ఉండే టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ తోపాటు , కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ ఇద్దరూ కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. కేసీఆర్ కు కరోనా వెలుగుచూశాక వీరిద్దరూ కూడా కరోనా బారినపడ్డారు. అయితే యువకులే కావడంతో వీరిద్దరూ ఇన్నాళ్లు హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందారు. వైద్యుల పర్యవేక్షణలో కరోనా తగ్గిపోతుందని భావించారు. అయితే తాజాగా కరోనా లక్షణాలు పెరగడం.. సీరియస్ అవుతున్న పరిస్థితులు కనిపించడంతో ఎందుకైనా […]

Written By: NARESH, Updated On : May 1, 2021 9:42 am
Follow us on

సీఎం కేసీఆర్ కు వెన్నంటి నీడలా ఉండే టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ తోపాటు , కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ ఇద్దరూ కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. కేసీఆర్ కు కరోనా వెలుగుచూశాక వీరిద్దరూ కూడా కరోనా బారినపడ్డారు.

అయితే యువకులే కావడంతో వీరిద్దరూ ఇన్నాళ్లు హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందారు. వైద్యుల పర్యవేక్షణలో కరోనా తగ్గిపోతుందని భావించారు. అయితే తాజాగా కరోనా లక్షణాలు పెరగడం.. సీరియస్ అవుతున్న పరిస్థితులు కనిపించడంతో ఎందుకైనా మంచిదని వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం.

ఎంపీ సంతోష్ నిన్నా మొన్నటి వరకు కేసీఆర్ కు తోడుగా నీడగా ఫాంహౌస్ లోనే ఉన్నారు. కేటీఆర్ కూడా నాన్న వెంట ఆస్పత్రికి వచ్చి దగ్గరగా తిరిగారు. వీరిద్దరూ కరోనా బారినపడడంతో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నప్పటికి పరిస్థితి కాస్త ఇబ్బంది కరంగా మారినట్టు తెలుస్తోంది.

మనిషి ఎంత బలంగా ఉన్నప్పటికీ కరోనా శరీరంలోని బలహీనమైన వ్యవస్థపై దాడి చేసి ఆరోగ్య పరిస్థితిని దిగజార్చుతోంది. అందుకే వైద్యులు సంతోష్ , కేటీఆర్ లకు లక్షణాలు పెరగడంతో వెంటనే ఆస్పత్రిలో చేరాలని సూచించినట్టు తెలుస్తోంది.

ఇక కేసీఆర్ కు ఆర్టీపీసీఆర్ పరీక్షలో మిశ్రమ ఫలితాలు రావడంతో ఇంకా ఐసోలేషన్ లో ఉన్నారు. రెండు మూడు రోజుల్లో టెస్టులు నిర్వహించే అవకాశం ఉందని ఆ తర్వాత నెగెటివ్ వస్తే హైదరాబాద్ వస్తారు. అయితే కేసీఆర్ బాడీ బలహీనంగా ఉందని.. కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.