
అక్షయ్ కుమార్ భారీ విరాళం ఏకంగా 25 కోట్లు ;
కరోనా భాదితుల సహాయక చర్యల కోసం భారత దేశ ప్రధాని మోడీ ‘ పీఎం కేర్స్ ఫండ్ ‘ పేరుతో విరాళాల సేకరణ ప్రారంభించారు. ఆ క్రమం లో ప్రధాని పిలుపునకు స్పందించిన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్
” పీఎం కేర్స్ ఫండ్ ” కి 25 కోట్ల భారీ విరాళమిచ్చారు. కరోనాపై పోరాటంలో తన వంతు సాయం గా ఈ విరాళమిస్తున్నానని అక్కీ ట్వీట్ చేశాడు. దాంతో అక్కి దాన గుణానికి చలించిన ప్రధాని మోడీ గొప్ప పని చేశావంటూ అక్షయ్ కుమార్ పై ప్రశంసలు కురిపించారు.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అంచెలచలుగా కష్టపడి ఎదిగిన అసలు సిసలు హీరో. విలక్షణ కథలను ఎంచుకుంటూ వరుసగా సూపర్ హిట్ సినిమాలతో తనకు తిరుగులేదని నిరూపిస్తున్నాడు. ముగ్గురు ఖాన్ లు బాలీవుడ్ లో సత్తా చాటుతున్న సమయంలో.. “టాయిలెట్ , ప్యాడ్ మ్యాన్, గోల్డ్ , రుస్తుం ” వంటి సందేశాత్మక మరియు దేశభక్తి కూడిన చిత్రాలలో నటిస్తూ బాక్సాఫీస్ ను కొల్లగొట్టాడు. సినిమాలే కాకుండా సామాజిక కార్యక్రమాలలోనూ అక్కీ తన విలక్షణత చూపిస్తుంటాడు. ప్రధాని మోడీని ఇంటర్వ్యూ చేసే అరుదైన అవకాశం దక్కించుకున్న అక్షయ కుమార్ తన వంతుగా ప్రజలను చైతన్య పరుస్తుంటాడు. తాజాగా కరోనా మహమ్మారిపై భారత్ చేస్తున్న పోరులో ప్రధాని ఇచ్చిన పిలుపునకు వెంటనే స్పందించి ప్రాణం ఉంటే ప్రపంచం ఉన్నట్లేనని సూచిస్తూ రూ.25 కోట్ల భారీ విరాళాన్ని అందించడం జరిగింది. అంతేకాదు దేశం మొత్తం మీద భారీ మొత్తంలో విరాళం ప్రకటించిన తొలి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కావడం విశేషం..