Controversy Over Mao Zedong Personal Life: మావో సే టుంగ్.. ఈ పేరు ఓ సంచలనం.. ఓ విప్లవ జ్వాల. రగిలే అగ్ని కణం.. భారత్ లో ఆ పేరుతో ఎంతో మంది ప్రభావితమై జీవితాలు ధారపోశారు. అందుకని మావో పేరు ఎప్పుడూ చర్చల్లో ఉంటూనే ఉంటాడు. కానీ ఇప్పుడో వివాదం చెలరేగింది.
మావో సేటుంగ్ కు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ‘లీ రూయి’ ఇటీవలే 2019లో చనిపోయాడు. అధికారిక లాంఛనంగా ఆయనకు అంత్యక్రియలు నిర్వహించాడు. లీ రూయికి విపరీతమైన క్రెడిబిలిటీ ఉంది.
మావో తో ఎంతో సాన్నిహిత్యంగా ఉన్న లీరూయి నాడే ఆయన ఆర్థిక విధానాలు బాగా లేవని విమర్శించాడు. మావో విధానాల వల్ల చైనా కోలుకోకుండా ఆర్థికంగా దెబ్బతింటుందని విమర్శించిన వారిలో లీ రూయి ఒకరు. చైనా కమ్యూనిస్టు పార్టీ త్రీగోర్జెస్ డ్యామ్, విద్యార్థుల అణిచివేతను ఈయన ఖండించి ఎలుగెత్తి చాటాడు.
లీరూయి చనిపోక ముందు ఒక సంఘటన జరిగింది.. దాంతోనే ఒక పెద్ద వివాదం చెలరేగింది. లీరూయి కూతురు అమెరికాలో ఉంటుంది. ఆమె లీరూయి రాసిన పుస్తకాలు.. ఆయన వ్యక్తిగత డైరీలు అన్నీ తీసుకెళ్లి ‘హువర్’ యూనివర్సిటీ పరిశోధకులకు అందించింది. అక్కడ భద్రపరిచింది.
‘మావో ’ జీవిత విశేషాలు.. ఆయన తీసుకున్న నిర్ణయాలు.. ఆయన వల్ల జరిగిన పరిణామాల గురించి లీరూయి డైరీల్లో రాసుకున్నాడు. ఈ డైరీలు అమెరికా చేరడంతో ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. ఇవి చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆర్గనైజేషన్ కు సంబంధించినవని.. అందుకని తమకు అప్పగించాలని ‘లీరూయి’ రెండో భార్య అమెరికా కోర్టులో కేసు వేసింది. దీంతో అందులో చైనా మావో గురించి రహస్యాలున్నాయన్న ఆసక్తి నెలకొంది. మవో సేటుంగ్ వ్యక్తిగత జీవితంపై రాసిన డైరీల్లో ఏమేం ఉన్నాయని? ఎందుకింత వివాదం అనే దానిపై ‘రామ్ టాక్’ ప్రత్యేక వీడియో మీకోసం..