Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం మరో వివాదం తెరమీదకు తెచ్చింది. కేసీఆర్ సర్కారు తెలంగాణలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ వేగంగా చేపడుతోంది. జీవో నెం. 317 వివాదాస్పద జీవోను విడుదల చేసింది. దీంతో ఉద్యోగులు, నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అటు ఉపాధ్యాయులు ఇటు నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. తెలంగాణ సర్కారు ఈ జీవోను రద్దు చేయాల్సిందేనని అందరు డిమాండ్ చేస్తున్నారు.

జీవో రద్దు చేయాలని బీఆర్కే భవన్ ను ముట్టడించేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేశారు. జీవో నెం. 317 వివాదాస్పదమవడానికి కారణాలు చూస్తే మన రాష్ర్టంలోని ఉద్యోగులను జోనల్, మల్టీజోనల్, స్టే కేడర్లుగా విభజించారు. దీంతో టీచర్ ఉద్యోగాలను జిల్లాల వారీగా భర్తీ చేసేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం మాత్రం కొత్త జిల్లాల వారీగా నియమించేందుకు జీవో తెచ్చారు.
Also Read: కాంగ్రెస్ పార్టీ గెలిచే సీట్లపై రేవంత్ కొత్త లెక్కలు..
దీంతో అటు ఉద్యోగులు ఇటు నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుత జీవో ప్రకారం సీనియర్లు పట్టణాలకే ప్రాధాన్యం ఇస్తుండటంతో వారికి అక్కడే సీటు కేటాయిస్తున్నారు. జూనియర్లను మాత్రం గ్రామాలకు పంపిస్తున్నారు. దీంతో జూనియర్లు ఇక గ్రామాల్లోనే ఎక్కువ రోజులు ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో జూనియర్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు నిరుద్యోగులకు కూడా ఈ జీవో ఆశనిపాతంగానే మారిందని చెప్పాలి. జూనియర్లు మారుమూల ప్రాంతాలకు పంపిస్తుండటంతో ఇక వారు అక్కడే ఉండాల్సి రావడంతో పోస్టులు ఖాళీ ఏర్పడవు. దీంతో నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా దొరకవు. అందుకే ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 317 రద్దు చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి.