Prophet Remarks Row: “ప్లాజిబుల్ డినయబులిటీ”.. తెలుగులో చెప్పాలంటే “నిరాకరణ సంభావ్యత.” ఇంగ్లీషులో గూడచర్యం కథలు, నవలలు చదివే వారికి బాగా తెలిసిన మాట ఇది. ఒక గూడచారిని ప్రత్యేకమైన పనిమీద ఒక దేశం మరొక దేశానికి పంపినప్పుడు, అనుకోని పరిస్థితుల్లో ఆ గూడచారి కనుక పట్టుబడితే, లేదా చనిపోతే పంపిన దేశం అతడిని అసలు పట్టించుకోదు. అతడు ఎవరో మాకు తెలియదు అన్నట్టుగా నటిస్తుంది. అధికారమే పరమావధిగా భావించే రాజకీయ పార్టీలకు కొన్ని అవసరాలు ఉంటాయి. తమకు అవసరం పడినప్పుడల్లా ఎందుకు పనికిరాని నాయకులను తెరపైకి తీసుకొస్తాయి. అటువంటి వారితో రకరకాల మాటలు మాట్లాడిస్తాయి. ఆ మాటలు సమాజంలోకి చర్చకు వెళ్లి చేయాల్సిన పనులు చేస్తాయి. ఈలోగా ఉధృత పరిస్థితులు ఏర్పడతాయి. పరిస్థితి చేయి దాటే లోపు సదరు నాయకుడిని పార్టీ సస్పెండ్ చేస్తుంది. అతడు ఎవరో కూడా మాకు తెలియనట్టుగా మాట్లాడతాయి. ఈలోగా ద్వితీయ శ్రేణులు తెరపైకి వస్తారు. పత్రికల్లో ప్రధాన శీర్షిక వార్తలు అయ్యేలాగా మాట్లాడతారు. రోడ్డు మీద వెళ్తారు. ఇంకెవరో బైక్ మీద వస్తారు. ఉన్నట్టుండి నడిచే వ్యక్తిని కత్తితో పొడుస్తారు. రక్తపు మడుగులో కొట్టుకుంటూ అతడు చచ్చిపోతాడు. పొడిచిన వారు రాక్షసానందం పొందుతారు. చనిపోయిన వాడి తరపున కొందరు వకాల్తా పుచ్చుకుంటారు. ఫలితంగా దాడులు, పోలీసుల కర్ఫ్యూలు, వైరసి జనజీవనం మొత్తం అస్తవ్యస్తం. మూడు దశాబ్దాల క్రితం వరకు తెలంగాణ ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొంది. ఫలితంగా చాలావరకు వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ఉపాధి లేక యువత చాలామంది రోడ్డున పడ్డారు. కొంతమంది బిక్కుబిక్కుమంటు కాలం గడిపారు.

పరిస్థితి మారింది
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక పోలీస్ వ్యవస్థను ఆధునికరించారు. ముఖ్యంగా పాతబస్తీలో పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో అల్లరిమూకల ఆగడాలకు చెక్ పడింది. అదే సమయంలో సైబరాబాద్ అనే ఐటీ సిటీకి అంకురార్పణ జరిగింది. శాంతిభద్రతలు అదుపులో ఉండటంతో హైదరాబాద్ పేరు ప్రఖ్యాతలు విస్తరించాయి. ఆ తర్వాత వచ్చిన వైయస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ దాకా హైదరాబాద్ అభివృద్ధి జరిగింది. బహుళ జాతి సంస్థలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ కంపెనీలు తమ కార్యకలాపాలను అమెరికా తర్వాత హైదరాబాద్ నుంచే కొనసాగిస్తున్నాయి. వేలాదిమంది యువతకు ఉపాధి లభిస్తుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో గొడవలు, అల్లర్లు జరిగాయి. అప్పట్లో సందిగ్ధ పరిస్థితులు ఏర్పడ్డాయి. చాలావరకు పరిశ్రమలు తమిళనాడుకు తరలిపోయాయి. తర్వాత 2014లో తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి.
బైంసా ఘటనతో
తెలంగాణ ఏర్పడిన రెండేళ్లకి వరంగల్ జిల్లాలోని పూజారిని ఓవర్గానికి చెందిన వ్యక్తి అతికిరాతకంగా కత్తితో పొడిచి చంపాడు. దీనిపై అప్పట్లో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది. ఆ పూజారి అంత్యక్రియలో అప్పటి బిజెపి నాయకుడు బండి సంజయ్ స్వయంగా పాల్గొన్నారు. ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు.
ఆదిలాబాద్ జిల్లా బైంసాలో ఓవర్గం మరో వర్గం వారికి చెందిన ఇళ్లను ఆస్తులను తగలబెట్టింది. ఈ సంఘటనలోనూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరించింది. కొందరు అసలు జరిగిన విషయాన్ని వెలుగులోకి తీసుకురావడంతో నిదితులపై నామమాత్రంగా చర్యలు తీసుకుంది. అంతకుముందే బిజెపి నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకోవడంతో టిఆర్ఎస్ కసి మీద ఉంది. ఇక అప్పటినుంచి ఇప్పటిదాకా ఇరు పార్టీల మధ్య ప్రచ్చన్న యుద్ధం సాగుతోంది. బిజెపి నాయకుల వ్యాఖ్యలకు, టిఆర్ఎస్ నాయకులు ప్రతి వ్యాఖ్యలు చేయడంతో పరిస్థితి నానాటికి ఇబ్బందికరంగా మారుతోంది.

స్టాండప్ కమెడీయన్ మూనావర్ ఫారూఖ్ హిందూ దేవుళ్లను కించపరిచేలాగా వ్యాఖ్యలు చేస్తుంటాడని ఆరోపణలు ఉన్నాయి. అయితే అతడిని హైదరాబాద్ తీసుకొచ్చి కామెడీ చేయిస్తానని అప్పట్లో మంత్రి కేటీఆర్ తెలిపారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ఇదే క్రమంలో మనోవర్ తో ఇటీవల హైదరాబాదులో స్టాండప్ కామెడీ షో చేయించారు. ఒకవేళ గనుక అతడు వస్తే అతడి వేదికను తగలబెడతానని, అతడిని కొడతానని బిజెపి శాసనసభ పక్ష నేత రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో ప్రభుత్వం కొంచెం సమయమనం పాటిస్తే పరిస్థితి మరోలా ఉండేది. కానీ పట్టు విడుపుకు వెళ్ళిన ప్రభుత్వం భారీ బందోబస్తు మధ్య మునావర్ తో కామెడీ షో చేయించింది. దీంతో రెచ్చిపోయిన రాజాసింగ్ ముస్లిం ప్రవక్త పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే నువ్వు శర్మ చేసిన వ్యాఖ్యల వల్ల ఇంటా బయట విమర్శలు మూట కట్టుకుంటున్న బిజెపి.. రాజాసింగ్ చేసిన పనికి మరింత ఇబ్బందుల్లో పడింది. దీంతో అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీనిపై అటు కేంద్ర నాయకత్వం కానీ, ఇటు రాష్ట్ర నాయకత్వం కానీ పల్లెత్తు మాట కూడా మాట్లాడటం లేదు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్లోని ఫరీదాబాద్, ఢిల్లీలోని ముజఫరాబాద్, కర్ణాటకలో హిజాబ్, హలాల్ వివాదాలు రెండు వర్గాల మధ్య ఎంతటి వైషమ్యాలను సృష్టించాయో చూస్తూనే ఉన్నాం. కానీ ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న హైదరాబాదులో రాజకీయ ప్రయోజనాల కోసం వివిధ పార్టీల నాయకులు చేస్తున్న వ్యాఖ్యల వల్ల నిర్వహించే సంస్కృతి కాస్త కత్తులు దూసుకునే దాకా వచ్చింది. దీనిని ఇప్పుడే కట్టడి చేయకుంటే మున్ముందు తెలంగాణ మరింత ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది.
[…] […]