
ఒక్క ఓటమి ఎన్నో గుణపాఠాలను నేర్పుతుందని అంటుంటారు. కానీ.. గత ఆరేండ్లుగా ప్రతీ ఎన్నికల్లోనూ ఓడిపోతున్న కాంగ్రెస్ వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. ఈ ఆరేళ్లలో ఎన్ని ఓటములు చూశారో కూడా లెక్కపెట్టలేం. అంతేకాదు.. పోయిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ మహామహులు కూడా డక్కీమొక్కీలు తిన్నారు. జానారెడ్డివంటి సీనియర్ లీడర్లు సైతం ఓటమి పాలయ్యారు. ఇంత జరుగుతున్నా ఎక్కడ లోపం అనే విషయాన్ని పార్టీ నాయకత్వం పట్టుకోలేకపోతోంది.
Also Read: టీఆర్ఎస్ 2వ జాబితా: సిట్టింగ్ లకు, మేయర్ బొంతుకు షాక్.. కొత్తవారికి టికెట్లు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. కానీ.. ఆ సెంటిమెంట్ తెలంగాణ ప్రజల్లో ముందు నుంచి కనిపించడం లేదు. ఎందుకంటే ఆ పార్టీ నేతలు కూడా ఆ నినాదాన్ని ఆ స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు కాబట్టి. దశాబ్దకాలం జాతీయంగా కాంగ్రెస్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఆదుకుంది. 2004, 2009 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆదుకోవడం వల్లనే జాతీయంగా కాంగ్రెస్ ప్రతిభ కనపర్చింది. అటువంటి రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్ రెండు రాష్ట్రాల్లోనూ పలుకుబడిని కోల్పోయింది. కొద్దో గొప్పో తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం అవుతుందనుకుంటే ఇక్కడ కూడా ఏమాత్రం ముందుకు పడటం లేదు.
ఎప్పటికప్పుడు ఓటమిని అంగీకరిస్తున్న నేతలు.. ఐక్యతను ప్రదర్శించడంలో మాత్రం విఫలం అవుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లను చూస్తే ఆ పార్టీ దుస్థితి ఎలా ఉందో ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి పాలైనా కాంగ్రెస్ నేతలకు ఏమాత్రం జ్ఞానోదయం కలగలేదు. రేవంత్ రెడ్డిపై వి.హనుమంతరావు లాంటి సీనియర్ నేతలు బహిరంగ విమర్శలు చేయడం ఇంకా మానుకోవడం లేదు.
Also Read: కేంద్రం సంచలన నిర్ణయం.. వారికి కూడా ఫ్రీ రేషన్..?
కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచి ఆధిపత్య పోరు పెద్ద మైనస్. గ్రూపుల కొట్లాటలు.. పదవుల పందేరంలో గొడవలు.. ఆ పార్టీ పరువును దిగజార్చుతున్నాయి. దీనికితోడు నాలుగు గోడల మధ్య కూర్చొని మాట్లాడుకోవాల్సిన మాటలు కూడా బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే తిరిగి కేసీఆర్ చెంతకు వెళతారన్న అభిప్రాయం కూడా ప్రజల్లో ఉన్నట్లు సమాచారం. 2014 నుంచి అనేక మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ను వీడి వెళ్లిపోయారు. అందువల్లనే ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయడం వేస్ట్ అని ప్రజలు భావిస్తుండటమే దాని ఓటమికి కారణాలుగా చెప్పాలి. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు ఐక్యతతో వ్యవహరించి పార్టీ పరువును కాపాడుకొనే ప్రయత్నం చేస్తారో చూడాలి మరి.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్