Congress Seniors: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం తరువాత అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. బహిరంగంగా ఆరోపణలు చేస్తూ నేతలు వార్తల్లోకి వస్తుండడం పరిపాటిగా మారుతోంది. రేవంత్‌రెడ్డిపై గుర్రుగా ఉన్న నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కొంతమంది పార్టీ మారతారా ? అనే అనుమానాలు సైతం వస్తున్నాయి. మొత్తంగా హస్తం పార్టీలో నేతల మధ్య ఉన్న విబేధాలు పొడచూపుతున్నాయి.

అయితే రేవంత్ చెప్పినట్టే చేయాలని, పార్టీ ధిక్కరణకు పాల్పడితే సహించేది లేదంటూ కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ సందేశాలిస్తోందట. టీ కాంగ్రెస్‌లో సీనియర్ల పేరుతో కొందరు చేస్తున్న రచ్చపై హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సీనియర్లతో సమావేశం పెట్టి వారి అభిప్రాయాలను ఢిల్లీకి తీసుకెళ్తానని బయలు దేరిన వీహెచ్‌కు కనీసం గుమ్మం వద్దకు కూడా ఎంట్రీకి అవకాశం ఇవ్వలేదు.
ఇదే సమయంలో పార్టీలో ఉంటే ఉండండి లేదంటే వీడండి. అనే సమాధానం ఏఐసీసీ కార్యాలయం నుంచి రావడంతో సీనియర్లు ఖంతుతిన్నారట. తాము దశాబ్ధాల నుంచి పార్టీలో ఉన్నామని ఫిర్యాదులు చేస్తేనమ్ముతారని, కనీసం రేవంత్‌రెడ్డికి తమకు ప్రాధాన్యత ఇవ్వాలన్న సూచనలు ఇస్తారని ఆశపడితే అడియాసలైన పరిస్థితి తయారయింది. వారిని నాన్ పర్‌ఫార్మింగ్ అసెట్స్ జాబితాలో చేర్చేసి లైట్ తీసుకోవడంతో సీనియర్లకు పాలుపోవట్లేదు.
Also Read: ఇంటర్ ఫలితాల పెంపు కోసం.. ప్రీ ఫైనల్ ప్రయోగం ఫలించేనా?
మొత్తంగా టీ కాంగ్రెస్ సీనియర్ నేతలు మరోసారి నోరెత్తితే ఏమవుతుందోననే భయం జగ్గారెడ్డికి మొదలైందనే టాక్ వినిపిస్తోంది. దీంతో మిగిలిన సీనియర్లంతా సైలెంట్ అయ్యారని సమాచారం. వచ్చే ఎన్నికల వరకు రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించుకుందట. అయితే రేవంత్ రెడ్డి మాత్రం రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వల్ల మంచి పలుకుబడి సాధించారు.
ఇందుకు తగ్గట్టే ఆయన కష్టం కండ్ల ముందు కదలాడుతోంది. పైగా జనాకర్షక ఉన్ననేతగా పేరుంది. ఆయనకున్న చిత్తశుద్ధిని ఎవరూ శంకించడం లేదు. సీనియర్లు చికాకు పెడుతున్నా.. రేవంత్ మాత్రం పల్లెత్తు మాట అనట్లేదు. మొత్తంగా తన చేతలతోనే రేవంత్ హైకమాండ్ మెప్పు పొందాడని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Also Read: కేంద్రం వర్సెస్ రాష్ట్రం: ధాన్యం యుద్ధం.. వరి కొయ్యలకు బలయ్యేదెవరో..?