AP Cabinet Updates: ఆంధ్రప్రదేశ్ లో మంత్రి వర్గ విస్తరణపై ప్రక్రియ మొదలు కావడంతో ఆశావహుల్లో ఆశలు పెరుగుతున్నాయి. 2019 లోనే మొదటి సారి మంత్రివర్గ విస్తరణ సమయంలోనే రెండున్నరేళ్ల సమయంలో మళ్లీ విస్తరణ చేపడతామని హామీ ఇవ్వడంతో అందరి మలివిడతపై భారీగా ఆశలు పెంచుకున్నారు. మొదటిసారి పదవులు దక్కని వారు ఇప్పుడు పదవి ఖాయమనే భరోసాలో ఉన్నారు. దీంతో అందరు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మంత్రివర్గ విస్తరణపై జగన్ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి? రాబోయే ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలి అనే దానిపై జగన్ స్పష్టమైన క్లారిటీతో ఉన్నట్లు చెబుతున్నారు. మంచి పనితనం ఉన్న వారినే మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు సమాచారం. దీనికోసం మహిళా ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ముగ్గురికి స్థానం కల్పించిన జగన్ ఈ మారు ఐదుగురికి అవకాశం ఇవ్వనున్నారనే వార్తలు వస్తున్నాయి.
Also Read: మూడు రాజధానుల కోసం జగన్ కు ఎందుకంత వెంపర్లాట?
సామాజిక సమీకరణల నేపథ్యంలో చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజాకు ఈసారి మంత్రివర్గంలో చోటు ఖాయమనే వాదనలు వస్తున్నాయి. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని చూస్తున్నారు. ఇక బీసీ వర్గానికొస్తే గుంటూరు జిల్లా విడదల రజనీ, అనంతపురం నుంచి ఉషశ్రీ చరణ్, ఎమ్మెల్సీ పోతుల సునీత, వరుదు కల్యాణి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మంత్రివర్గ విస్తరణపై జగన్ ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం.
ఎస్సీ కోటాలో గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, అనంతపురం జిల్లా నుంచి జొన్నలగడ్డ శ్రీదేవి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి రేసులో ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో జగన్ మంత్రివర్గ విస్తరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. నిష్ణాతులైన వారిని మంత్రివర్గంలోకి తీసుకుని వారితో రాబోయే ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారు.
Also Read: ప్రజల మూడ్ మార్చేద్దాం.. ఉత్తరాంధ్ర వాసుల్లో సెంటిమెంట్ రగిల్చే పనిలో ప్రభుత్వం