AP Three Capitals: కొందరు వాపును చూసుకుని బలుపని మురుస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వ్యవహారం అలాగే ఉంది. అందరు తప్పు అన్న దాన్ని ఒప్పని చెబుతుంటారు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లని వాదిస్తున్నారు. దీంతో ప్రజల్లో మరింత చులకన అవుతున్నారు. అయినా తాననుకున్నది చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫలితంగా వ్యవస్థలను తప్పుబడుతూ తానే తప్పులు చేస్తున్నారు. తప్పటడుగులు వేస్తున్నారు. ఒకటి రెండు కాదు వందల కేసుల్లో కోర్టులు మొట్టికాయలు వేస్తూనే నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అని దులుపేసుకునిపోతున్నారు.

మూడు రాజధానుల వ్యవహారంలో హైకోర్టు అది తప్పు అని తీర్పు చెప్పినా దాన్ని అసెంబ్లీలో చర్చకు పెట్టి తనలోని అమాయకత్వాన్ని బయటపెట్టుకుంటున్నారు. అదేదో హీరోయిజం అని జబ్బలు చరుచుకుంటున్నా కోర్టులో ఉన్న వ్యవహారాలపై మాట్లాడకూడదనే కనీస మర్యాద కూడా తెలియదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అవసరమైతే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చు కదా అని చెబుతున్నారు. ఇదివరకే సుప్రీంకోర్టుతో పలు కేసుల్లో తిట్లు తినడంతో ఇక ఆ సాహసం చేయడం లేదని తెలుస్తోంది.
Also Read: ప్రజల మూడ్ మార్చేద్దాం.. ఉత్తరాంధ్ర వాసుల్లో సెంటిమెంట్ రగిల్చే పనిలో ప్రభుత్వం
మూడు రాజధానులు కావాలని ఎవరు అడగకపోయినా అదేదో అవినీతి జరిగిందని నిందలు వేసినా అవి నిరూపణ కాలేదు. దీంతో ముందుకు వెళ్లడానికి జగన్ కు మరో మార్గం కనిపించలేదు. అందుకే అసెంబ్లీలోనే మూడు రాజధానుల చర్చ పెట్టి తన పరువు తీసుకుంటున్నారు. న్యాయవ్యవస్థపై నమ్మకం లేకపోతే ఆయన అన్ని కేసుల్లో కోర్టుల చుట్టు ఎందుకు తిరగడం అనే వాదనలు కూడా వస్తున్నాయి. దీంతో జగన్ కు రాబోయే రోజుల్లో భంగపాటు తప్పదని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానా దివాలా తీయడంతో ఇప్పుడు మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. జగన్ ఒంటెత్తు పోకడతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తామేదో సాధించామని చెబుతున్నా అసలు నిజాలు మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో జగన్ వ్యవహార శైలిపై విమర్శలు వస్తున్నాయి. మూడు రాజధానుల విషయంలో కోర్టుతో విభేదించడం మూర్ఖతవ్వమే అందరు వాదిస్తున్నారు. కానీ జగన్ మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. దీంతో రాబోయే ఎన్నికల్లో జగన్ కు కష్టమేనని తెలుస్తోంది.
[…] […]