Komatireddy Rajagopal Reddy: కాగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటన వేల ఆ పార్టీ ఎమ్మెల్యే అధిష్టానానికి జలక్ ఇచ్చారు. రాహుల్‌గాంధీ శుక్రవారం వరంగల్‌లో నిర్వహించిన రైతు సంఘర్షణ భారీ బహిరంగ సభకు దూరంగా ఉన్నారు.
రాజగోపాల్ రాజకీకం..
కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ సభకు దూరంగా ఉండాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నిర్ణయం తీసుకొన్నారు. కొంత కాలంగా పార్టీ నాయకత్వం తీరుపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఈ కారణంగానే రాహుల్ సభకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌పార్టీ నాయకత్వం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రాజగోపాల్‌రెడ్డి ఈ విషయమై బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీలో చేరుతానని కూడా గతంలో ప్రకటించారు. బీజేపీలో చేరే విషయమై ఆ పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన ఆడియో సంభాషణ కూడా గతంలో వైరల్ గా మారింది.

ఏ మేరకు శాంత పరుస్తాడో..
అయితే ఇలా సడెన్‌గా బహిరంగ సభకు డుమ్మా కొట్టాలనుకోవడంపై పలువురు కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజగోపాల్‌రెడ్డికి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యవహార శైలి నచ్చకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కేవలం సీఎల్పీ సమావేశాలకు మాత్రమే హాజరవుతూ వస్తున్నారు.
అసెంబ్లీ ఎదురు దాడి తర్వాత..
ఇటీవల జరిగిన అసెబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో రాజగోపాల్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మధ్య వాగ్వాదం జరిగింది. కాంట్రాక్టర్ అని రాజగోపాల్‌రెడ్డిపై తలసాని వ్యాఖ్యానించారు. ఇందుకు రాజగోపాల్‌రెడ్డి కూడా పేకాట ఆడే మంత్రి కూడా తనగురించి మాట్లాడడం సిగ్గుగా ఉందంటూ విమర్శించారు. దీంతో కేటీఆర్ రగంలోకి దిగి రాజగోపాల్‌రెడ్డిపై ఎదురు దాడి చేశారు. ఈ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మౌనం వహించారు. రాజగోపాల్‌రెడ్డికి ఎవరూ మద్దతు ఇవ్వలేదు. దీంతో సమావేశా తర్వాత నుంచి రాజగోపాల్‌రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. సీఎల్పీ తీరుపైనా ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే రాహుల్ సభకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

కమలంవైపు చూపు..
రాజగోపాల్‌రెడ్డి తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అని భావిస్తున్నారు. కాంగ్రెస్‌తో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే పరిస్థితి లేదని పేర్కొంటున్నారు. ఈమేరకు బహిరంగ వ్యాఖ్యలు కూడా చేశారు. త్వరలో బీజేపీలో చేరుతానని కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా రాహుల్ సభకు దూరంగా ఉండాలని భావిస్తున్నారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ సభ తర్వాత రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌తో పూర్తిగా తెగదెంపులు చేసుకుంటారని భావిస్తున్నారు.
అయితే ఇప్పటికే పార్టీ సీనియర నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని బుజ్జగించిన రేవంత్ తమ్ముడు రాజగోపాల్‌రెడ్డిని ఏ మేరకు శాంత పరుస్తాడో చూడాలి.