Telangana Congress Leaders: నేషనల్ హెరాల్డ్ కేసుల ఈడీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ప్రశ్నించడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. ఇందులో భాగంగా గురువారం హైదరాబాద్ లో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి తదితరులు పాల్గొని ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని వారించే ప్రయత్నంలో కాంగ్రెస్ నేతలు చేసిన గొడవతో చిక్కుల్లో పడ్డారు.
కాంగ్రెస్ మహిళా నేత రేణుకాచౌదరి ఆడ పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. మరోవైపు మల్లు భట్టివిక్రమార్క కూడా ఓ పోలీస్ అధికారి కాలర్ పట్టుకున్నారనే వార్తలు వచ్చాయి. రేవంత్ రెడ్డిపై కూడా కేసు నమోదైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతల అత్యుత్సాహంతో వివాదాల్లో ఇరుక్కున్నారు. సాధారణంగా ఆందోళన చేస్తే నేతలను అరెస్టు చేసి తరువాత వదిలిపెడతారు. కానీ నిన్న జరిగిన ధర్నాలో కాంగ్రెస్ నేతల తీరు వివాదాస్పదం కావడంతో వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
Also Read: Agneepath Row: ‘అగ్నిపథ్’తో రాజుకున్న దేశం.. అసలేంటి వివాదం? ఎందుకు అగ్గిరాజేసింది?
కొద్దిరోజులుగా కాంగ్రెస్ నేతలు ఉనికి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రజల్లో పార్టీ ప్రతిష్ట మసకబారుతోంది. దీంతో వారు తమ పార్టీని ప్రజలు గుర్తించాలనే ఉద్దేశంతో అతిగా ప్రవర్తించినట్లు చెబుతున్నారు. అందుకే వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. తమ ఉనికిని గుర్తించే క్రమంలో కాంగ్రెస్ నేతలు పాట్లు పడినట్లు సమాచారం. రాజ్ భవన్ ఎదుట ఉదయం ఐదు గంటలకే ఎన్ఎస్ యూఐ ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసనకు దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.
కాంగ్రెస్ నేతల తీరు గొడవలకు దారి తీసింది. దీంతో పోలీసులు వారిపై కేసులు పెట్టేందుకు వెనకాడలేదు. దీనిపై నేతలు స్పందించిన తీరుకే విమర్శలు వచ్చాయి. ప్రజా జీవనానికి అడ్డంకులు సృష్టించారనే కారణంతోనే వారిపై కేసులు పెట్టినట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ కోసం చేపట్టిన ఆందోళన కాస్త వారికే ప్రమాదకరంగా మారింది. ప్రస్తుతం వారిపై కేసులు పెట్టడంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. దీనికి కాంగ్రెస్ నేతల వ్యవహారం ఎలా ఉంటుందో తెలియడం లేదు. మొత్తానికి నేతల అరెస్టుతో కేసుల వరకు వెళ్లడం ఆందోళన కలిగించేదే.