KCR vs BJP బీజేపీతో కొట్లాడేది కేసీఆర్.. కేసీఆర్ తో కొట్లాడేది బీజేపీ.. మరి కాంగ్రెస్ ఎక్కడ. ఇది ఈనాటి తెలంగాణ రాజకీయ ముఖచిత్రం.. పోటీపోటీగా మునుగోడులో కేసీఆర్, అమిత్ షా సభలు జరిగాయి. కేసీఆర్ సభలో సీపీఐ మద్దతు ఇస్తూ పాల్గొన్నది. చాడా వెంకటరెడ్డి, నారాయణ టీవీలో టీఆర్ఎస్ కు మద్దతు తెలిపారు.
బీజేపీని ఓడించాలంటే కేసీఆర్ కు ఒక్కడికే సాధ్యం కాబట్టి తమ మద్దతు ఇస్తున్నట్టు సీపీఐ ప్రకటించింది. 1969 నుంచి ఈ స్లోగన్ ఉంది దేశంలో.. నాడు ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బలపడిందని చెప్పి నాడు సీపీఐ సహా అందరూ కలిసి ఐక్య సంఘటన కట్టారు. ఇదే సీపీఐ, సీపీఎం కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జట్టు కట్టింది. జనసంఘ్, స్వతంత్ర పార్టీ, సీపీఐ, సీపీఎం కలిసి కాంగ్రెస్ తో పోరాడాయి. ప్రగతి శీల శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చాయి.
1969లో లాగానే ఇప్పుడు కేసీఆర్ ప్రగతి శీల పార్టీగా ఎలా ఏర్పడ్డారో సీపీఐ చెప్పాల్సి ఉంటుంది. దేశంలో కాంగ్రెస్ ను.. తెలంగాణలో టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు ఇవ్వడం చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. బీజేపీని ఓడించడానికి అన్ని పార్టీలు ఏకం కావాలని సీపీఐ అభిప్రాయపడింది.
బీజేపీ సభలో కోమటిరెడ్డి ఇచ్చిన పిలుపు ఏంటంటే.. తెలంగాణ ఉద్యమంలో బాగుపడ్డది కేసీఆర్ కుటుంబం అని.. ఆయనను ఓడించాలంటే అన్ని పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. బీజేపీ వల్లనే కేసీఆర్ ను గద్దె దించడం సాధ్యమని కోమటిరెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి కూడా చెప్పుకొచ్చారు. అందుకే రాజీనామా చేసినట్టు రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
బీజేపీని ఎదుర్కోవాలంటే కేసీఆర్ తప్ప మరొకరు లేరు. రెండో వైపు కేసీఆర్ ను గద్దెదించాలంటే బీజేపీ కంటే బలమైన పార్టీ ఇంకోటి లేదని చెబుతున్నారు. మరి కాంగ్రెస్ ఎక్కడుందన్నది ప్రశ్న. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..