https://oktelugu.com/

Revanth Reddy: ‘రేవంత్’ దళిత గిరిజన ఆత్మగౌరవ సభ హోరు

రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాక నిజంగానే కాంగ్రెస్ కు ఊపు వచ్చింది. తెలంగాణ సీఎం కేసీఆర్ పాలన వైఫల్యాలను ఎండగడుతూ తెలంగాణ అంతటా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న రేవంత్ తీరు ఆసక్తి రేపుతోంది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిలో చేపట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షకు కాంగ్రెస్ శ్రేణులు పోటెత్తారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు ఉత్సాహబరిత ప్రసంగాలు చేసి కేసీఆర్ సర్కార్ తీరును ఎండగట్టారు. *ఆత్మగౌరవంతో […]

Written By:
  • NARESH
  • , Updated On : August 24, 2021 / 04:37 PM IST
    Follow us on

    రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాక నిజంగానే కాంగ్రెస్ కు ఊపు వచ్చింది. తెలంగాణ సీఎం కేసీఆర్ పాలన వైఫల్యాలను ఎండగడుతూ తెలంగాణ అంతటా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న రేవంత్ తీరు ఆసక్తి రేపుతోంది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిలో చేపట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షకు కాంగ్రెస్ శ్రేణులు పోటెత్తారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు ఉత్సాహబరిత ప్రసంగాలు చేసి కేసీఆర్ సర్కార్ తీరును ఎండగట్టారు.

    *ఆత్మగౌరవంతో బతకాలంటే కాంగ్రెస్ కు మద్దతివ్వండి: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

    టీఆరెఎస్ పాలనలో దళిత గిరిజనులకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. తెలంగాణ సంపద, వనరులు కొద్దీ మంది చేతుల్లోనే బందీ అయ్యాయన్నారు. దళిత గిరిజనులు ఆత్మగౌరవంగా జీవించడానికే కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు.ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని భట్టి అన్నారు. హుజురాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధును కేసీఆర్ చేపట్టారని ఆరోపించారు. 119 నియోజక వర్గాల్లో దళిత, గిరిజన బంధువు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు.

    *కేసీఆర్ కు జైలు జీవితమే: మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల

    రేవంత్ వచ్చాక కాంగ్రెస్ కు కొత్త ఉత్సహం వచ్చిందని మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. సీఎం కేసీఆర్.. ఈ ఊరిని దత్తత తీసుకొని ఏం చేసిండని ప్రశ్నించాడు. ఒక్కరూపాయైన ఖర్చు చేసిండా.. రేపటి వరకు ఇక్కడే ఉంటాం.. దమ్ముంటే చెప్పండని నిలదీశాడు. దత్తత అంటే.. ఊరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్నారు. కాంగ్రెస్ హయాంలో చాలా గ్రామాలూ అలా చేసి చూపించామన్నారు. కానీ ఒక్క వర్గానికి డబ్బులిస్తాం అని చెప్పడం అవివేకమన్నారు.ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాం. కేసీఆర్.. డబుల్ బెడ్ రూమ్ లు ఎక్కడ ఇచ్చావో చెప్పాలన్నారు.. కేసీఆర్ నువ్వు చేసిన ద్రోహాలకు.. నువ్వు పురుగులో పడి చస్తావ్ అని తీవ్ర స్థాయిలో విమర్శించారు.. నీ పూజలు కూడా నిన్ను సేవ్ చేయలేవన్నారు. కేసీఆర్ నిన్ను చరిత్ర క్షమించదు.. హుజురాబాద్ ఎన్నికల కోసమే పదవులు, పథకాలు ప్రవేశపెడుతున్నాడని విమర్శించాడు.

    వైఎస్ఆర్.. ఆరోగ్య శ్రీ, పెన్షన్ పథకాలు, ఉచిత విద్యుత్ ఎన్నికల కోసం తేలేదని. ప్రజలకోసం ప్రవేశపెట్టారని పొన్నాల చెప్పుకొచ్చారు. ఆరోగ్య శ్రీ తో నిరుపేదలు పెద్దపెద్ద జబ్బులకు ఉచిత చికిత్స పొందారన్నారు. సీబీఐ 2014లోనే కేసీఆర్ పై మూడు కేసులున్నాయ్ అని ప్రకటించిందన్నారు. రానున్న రోజుల్లో కేసీఆర్ కు జైలు జీవితమే ప్రాప్తి అన్నారు. వరంగల్ కొత్త జైలు కేసీఆర్ కోసమే కట్టుకుంటుండు అని ఎద్దేవా చేశారు.