Congress Party: ఐదు రాష్ట్రాల ఓటమి.. మొదటి పీసీసీ చీఫ్ సిద్ధూ ఔట్.. కాంగ్రెస్ ప్రక్షాళనే

Congress Party: కాంగ్రెస్ పార్టీలో అంతర్మథనం మొదలైంది. దిద్దుబాటు చర్యలకు పూనుకుంటోంది. పార్టీని ప్రక్షాళన చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా అయిదు రాష్ట్రాల్లో పరాభవం దృష్ట్యా పార్టీని గాడిలో పెట్టే క్రమంలో పలు మార్గాలు అన్వేషిస్తోంది. ఇందుకు గాను పీసీసీ అధ్యక్షుల మార్పు చేపడుతోంది. అయిదు రాష్ట్రాల్లో ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షులను మార్చేందుకు సిద్ధమైంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారం నిలబెట్టుకోలేకపోయింది. పంజాబ్ లో అధికారంలో ఉన్నా స్వయంకృతాపరాధంతో పార్టీ […]

Written By: Srinivas, Updated On : March 16, 2022 2:16 pm
Follow us on

Congress Party: కాంగ్రెస్ పార్టీలో అంతర్మథనం మొదలైంది. దిద్దుబాటు చర్యలకు పూనుకుంటోంది. పార్టీని ప్రక్షాళన చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా అయిదు రాష్ట్రాల్లో పరాభవం దృష్ట్యా పార్టీని గాడిలో పెట్టే క్రమంలో పలు మార్గాలు అన్వేషిస్తోంది. ఇందుకు గాను పీసీసీ అధ్యక్షుల మార్పు చేపడుతోంది. అయిదు రాష్ట్రాల్లో ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షులను మార్చేందుకు సిద్ధమైంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారం నిలబెట్టుకోలేకపోయింది.

sonia, rahul

పంజాబ్ లో అధికారంలో ఉన్నా స్వయంకృతాపరాధంతో పార్టీ నిలువునా మోసపోయింది. అధికారం కోసం కనీసం పోరాటం కూడా చేయలేదు. ప్రతిపక్ష హోదాలో కూడా సరైన స్థానాలు దక్కించుకోలేకపోయింది. కేవలం 18 సీట్లకే పరిమితమై పరువు పోగొట్టుకుంది. దీంతో అయిదు రాష్ట్రాల్లో అడ్రస్ గల్లంతయింది. ఇక్కడ బీజేపీ కూడా తగినన్ని సీట్లు గెలుచుకోలేకపోయింది.

Also Read:  పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.2వేల కోట్ల మోసం.. ఆర్బీఐ ముందుకు వివాదం

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను రాజీనామా చేయాలని ఆదేశించింది. దీంతో ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ జారీ చేసిన ఆదేశాలను పాటిస్తూ పీసీసీ అధ్యక్షులు రాజీనామాలకు సిద్ధమయ్యారు. ీ మేరకు పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోతి సింగ్ సిద్దూ తన పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ లో మరిన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయనే విషయం అందరికి అర్థమవుతోంది.

congress party

త్వరలో జరిగే హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన చర్యలు చేపడుతోంది. పీసీసీ అధ్యక్షులను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధిష్టానం చర్యలు తీసుకుంటోంది. పీసీసీ అధ్యక్షులను మార్చి కొత్త వారికి బాధ్యతలు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సోనియాగాంధీ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకు గాను పార్టీలో యువ నేతలకు స్థానాలు కల్పించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న చర్యలతో భవిష్యత్ లోనైనా విజయం సాధిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

Also Read: కాంగ్రెస్ నేత మల్లు భట్టికి ఓఫెన్ ఆఫర్ ఇచ్చిన కేసీఆర్

Tags