Homeజాతీయ వార్తలుCongress 6 Guarantees: ఆధార్ అప్ డేట్ తప్పని సరి కాదు!

Congress 6 Guarantees: ఆధార్ అప్ డేట్ తప్పని సరి కాదు!

Congress 6 Guarantees: ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లేందుకు, ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రజాసాలన పేరుతో గ్రామ, వార్డు సభలకు శ్రీకారం చుట్టింది. తొలి రోజు నిర్వహించిన సభలకు అనూహ్య స్పందన వచ్చింది. భారీగా వివిధ పథకాలతోపాటు, రేషన్‌ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు. ఒకరోజు గడిచినా ప్రజల్లో ఇంకా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏయే పథకాలకు తాము అర్హులం, ఎలా దరఖాస్తుత చేసుకోవాలి, రేషన్‌ కార్డు తప్పనిసరా? ఆధార్‌ కుటుంబంలో అందరికీ లేదు.. పథకాలు రావా? ఆధార్‌ అప్‌డేట్‌ చేయలేదు.. దరఖాస్తు చేసుకోవచ్చా.. ఇలా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అప్‌డేట్‌ కోసం పరుగులు..
అభయహస్తం దరఖాస్తుకు ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరని ప్రచారం జరుగుతోంది. లేందటే 5 గ్యారంటీలు రావని పేర్కొంటున్నారు. దీంతో చాలా మంది ఆధార్‌ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. వేకువజాము నుంచే క్యూ కడుతున్నారు. తిండి తిప్పలు మాని పడిగాపులు కాస్తున్నారు. అడ్రస్, ఫోన్‌ నంబర్‌ అప్‌డేట్‌ చేసుకుంటున్నారు. కేంద్రాల నిర్వాహకులు రోజుకు 50 టోకెన్లు మాత్రమే ఇస్తుండడంతో దరఖాస్తు గడువు ముగిసేలోగా ఆధార్‌ అప్‌డేట్‌ అవుతుందో లెదో అని టెన్షన పడుతున్నారు.

అప్‌డేట్‌ అవసరం లేదు…
ఇలా ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో అధికారులు ఓ గుడ్‌న్యూస్‌ చెప్పారు. దరఖాస్తుపై ఆధార్‌ నంబర్‌ రాసి, దానికి ఆధార్‌ జిరాక్స్‌ జతచేస్తే సరిపోతుందంటున్నారు. అప్‌డేట్‌ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు. వినియోగంలో ఉన్న ఫోన్‌ నంబర్‌ కూడా దరఖాస్తుపై రాయాలని సూచిస్తున్నారు. కమ్యూనికేషన్‌ కోసం మాత్రమే ఫోన్‌ నంబర్‌ అడుగుతున్నామని తెలిపారు. ఆధార్‌ అప్‌డేట్‌ చేస్తేనే దరఖాస్తు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని వెల్లడించారు. మీసేవ కేంద్రాల నిర్వాహకులు కూడా ఇదే విషయం వెల్లడిస్తున్నారు.

అనుహ్య స్పందన..
గ్యారంటీ స్కీంలను లబ్ధిదారులకు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రజాపాలనకు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. గురువారం ప్రారంభించిన కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, రైతుభరోసా, చేయూత పథకాలకు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. ఆధార్, రేషన్‌ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటామని, అందులోని చిరునామానే దరఖాస్తులో రాయాలని అధికారులు సూచించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular