https://oktelugu.com/

వైసీపీలో భగ్గుమన్న విభేదాలు..

నివురుగప్పిన నిప్పులా ఉన్న వైసీపీలో ఒక్కసారిగా అసంతృప్తి చెలరేగింది. పార్టీలో ఉన్నవారికి ప్రాధాన్యం దక్కకపోవడంతో ఓ వైసీపీ నియోజకవర్గ ఇన్ చార్జి బయటపడ్డాడు. పార్టీలో జరుగుతున్న వ్యవహారంపై బహిరంగంగా మాట్లాడి అధికార పార్టీకి షాకిచ్చాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైసీపీలో చర్చనీయాంశమయ్యాయి. వైసీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో వైసీపీ గెలవలేదు. 2009,2014,2019లో వరుసగా టీడీపీనే ఇక్కడ గెలిచింది. అంతకుముందు కాంగ్రెస్ గెలిచింది.2019లో ఉండి వైసీపీ అభ్యర్థిగా నర్సింహారాజు పోటీచేసి టీడీపీ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 2, 2020 4:10 pm
    Follow us on


    నివురుగప్పిన నిప్పులా ఉన్న వైసీపీలో ఒక్కసారిగా అసంతృప్తి చెలరేగింది. పార్టీలో ఉన్నవారికి ప్రాధాన్యం దక్కకపోవడంతో ఓ వైసీపీ నియోజకవర్గ ఇన్ చార్జి బయటపడ్డాడు. పార్టీలో జరుగుతున్న వ్యవహారంపై బహిరంగంగా మాట్లాడి అధికార పార్టీకి షాకిచ్చాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైసీపీలో చర్చనీయాంశమయ్యాయి.

    వైసీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో వైసీపీ గెలవలేదు. 2009,2014,2019లో వరుసగా టీడీపీనే ఇక్కడ గెలిచింది. అంతకుముందు కాంగ్రెస్ గెలిచింది.2019లో ఉండి వైసీపీ అభ్యర్థిగా నర్సింహారాజు పోటీచేసి టీడీపీ అభ్యర్థి రామరాజుచేతిలో ఓడిపోయారు. ఈ క్రమంలోనే ఉండిలో వైసీపీ బలోపేతం కోసం ప్రయత్నిస్తున్న పార్టీకి అక్కడి మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు కొరుకుడు పడడం లేదట.. ఇప్పుడు ఇదే వైసీపీ పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

    తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం వైసీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి.  ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీలోని కుమ్ములాటలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉండి నియోజకవర్గంలో వైసీపీలో వర్గపోరు ఉందంటూ బాంబు పేల్చారు. ఉండిలో వైసీపీ ఓడిపోవడానికి కారణం ఈ గ్రూపు రాజకీయాలేనని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజులుగా పార్టీలో ఒకరంటే మరొకరికి పడడం లేదని.. పార్టీ కోసం కష్టపడ్డవారికి అస్సలు ఆదరణ లేదంటూ  ఆరోపణలు గుప్పించడం దుమారం రేపింది. ఇప్పటికైనా ఉండి నియోజకవర్గంలో నేతలు రాజకీయాలు మానకపోతే తమ లాంటి నాయకులకు ఏం కాదని.. మధ్యలో పోయేది మీరేనంటూ కార్యకర్తలు,నేతలను సర్రాజు హెచ్చరించడం సంచలనమైంది.

    అధికార పార్టీలో ఇప్పటికే చెదురుముదురు ఘటనలు జరిగినా ఈ స్థాయిలో పార్టీ తీరుపై మండిపడ్డ నేత మరొకరు లేరు. ఇప్పుడిప్పుడే పార్టీలోని విభేదాలు బయటపడుతున్నాయి. ప్రభుత్వాన్ని పట్టించుకుంటున్న సీఎం జగన్ పార్టీపై శీతకన్ను వేయడం వల్లే ఇలా పార్టీలోని అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయని సమస్యలు చక్కదిద్దాలని  క్షేత్రస్థాయి వైసీపీ నేతలు కోరుతున్నారు.