Marriage In Uttar Pradesh: ప్రతీ ఒక్కరి జీవితంలో అద్భుతమైన, మరుపురాని ఘట్టం పెళ్లి. కాగా, కరోనా మహమ్మారి వలన ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల కాలంలో అతి తక్కువ మంది అతిథుల మధ్య పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అలా పెళ్లి వేడుకల్లో కొంత కోలాహలం తగ్గుతున్నది. కాగా, పెళ్లి అనగానే ఏదో ఒక చిన్నపాటి గొడవలు జరుగుతుంటాయి. అయితే, బంధువులు వాటిని సమసిపోయేలా చేస్తుంటారు. కాగా, ఈ పెళ్లిలో పూల దండ వలన ఇబ్బంది వచ్చింది. ఆ ఘర్షణతో ఏకంగా వధూవరుల కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు ఏమైంది, అసలు ఈ పెళ్లి ఎక్కడ జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ స్టేట్..ఔరయా డిస్ట్రిక్ట్‌లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జిల్లాలోని బిదునా కొత్వాలికి చెందిన నవీన్ బస్తీలో మ్యారేజ్ జరుగుతున్నది. అంతలోనే వివాదం చెలరేగింది. ఇందుకు కారణం పూలదండ. సంప్రదాయం ప్రకారం వరుడు వధువు మెడలో పూల దండను వేయాల్సి ఉంటుంది. కానీ, వరుడు వధువుపైకి పూల దండను విసిరేశాడు. దాంతో నవ వధువు తనకు ఈ పెళ్లి వద్దని నిరాకరించింది. వరమాల వేయకుండా విసిరేయడంపైన తీవ్రమైన మనస్తాపం చెందింది. నవీన్ బస్తీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
Also Read: మాఘ అమావాస్య రోజు ఏ రాశి వారు ఏ వస్తువులను దానం చేస్తే.. ఎలాంటి ఫలితం కలుగుతుందో తెలుసా?
పెద్దలు ఈ విషయం తెలుసుకుని వధువును ఒప్పించేందుకుగాను ప్రయత్నించారు. కానీ, తను పెళ్లి చేసుకోలేనని నిరాకరించింది. దాంతో వధువు, వరుడు .. ఇరు కుటుంబాల మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. అయితే, దండను తాను విసిరలేదని వరుడు చెప్తున్నాడు. కానీ, వరుడు విసిరిడాని వధువు అంటోంది. అలా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. వధువును ఒప్పించేందుకు కుటుం సభ్యులు ప్రయత్నించినప్పటికీ ఆమె నిరాకరించింది.
దాంతో వివాదం ఇంకా ముదిరింది. చిన్న విషయానికే వధువు పెళ్లి సంబంధం వద్దని చెప్పడం సరికాదని అందరూ అన్నారు. పోలీసులు కూడా రంగ ప్రవేశం చేసి పెళ్లి జరిగేందుకుగాను ప్రయత్నించారు. కానీ, వారి వల్ల కూడా కాలేదు.
మొత్తంగా యువతి మొండిగా వ్యవహరించడం వల్లే ఇటువంటి ఘర్షణ జరిగి, చివరకు పెళ్లి ఆగిపోయిందనేది స్పష్టమయింది. అయితే, ఆమె నిర్ణయంతో ఇరు కుటుంబాల పెద్దలు, కుటుంబ సభ్యులు నవ్వుల పాలయ్యారు.
Also Read: పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా..ఈ రాశి వారిని పెళ్లి చేసుకుంటే జీవితమే మారిపోతుంది!