Lakshmi Pranathi: ఫస్ట్ ట్వీట్ నా లవ్లీ భర్తతో అని జూనియర్ ఎన్టీఆర్ సతీమణి ప్రణతి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే స్టార్ స్టార్ హీరోలు భార్యలు తమ భర్త కు , ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను, విశేషాలను తమ భర్తల ఫ్యాన్స్ తో పంచుకుంటూ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నారు. మహేష్ బాబు సతీమణి నమ్రత, రామ్ చరణ్ సతీమణి ఉపాసన, అల్లు అర్జున్ సతీమణి స్నేహ ఇలా చాలా మంది స్టార్ హీరోలు భార్యలు సోషల్ మీడియాలో చాలా బాగా యాక్టివ్ గా ఉన్నారు.

అయితే తాజాగా ఈ లిస్టు లోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి జాయిన్ అయింది. తాజాగా ప్రణతి సోషల్ మీడియాలో అడుగు పెడుతూనే.. ఎన్‌టీఆర్ కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. ఆ ఫోటోతో పాటు ‘మీ అందరితో కలిసి ట్విటర్‌లో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది అని, నా మొదటి ట్వీట్ నా లవ్లీ భర్తతో పోస్ట్ చేస్తున్నాను’ అంటూ ప్రణతి తన భర్త ఎన్టీఆర్ ట్యాగ్ చేయడం విశేషం.
Also Read: కొత్త జిల్లాలతోనే ఏపీకి మూడు రాజధానులు!
ఇప్పటివరకు సోషల్ మీడియాకు, లైమ్ లైట్ కు దూరంగా ఉన్న ప్రణతి ఒక్కసారిగా ట్విటర్‌లో అడుగుపెట్టడం అందరికి షాక్ ఇచ్చింది. ఇక లక్ష్మి ప్రణతి ట్విటర్ లో అడుగుపెట్టిన గంటల్లోనే వేల సంఖ్యలో ఫాలోవర్స్ ను సొంతం చేసుకోవడం విశేషం. కాగా ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి ఇప్పటివరకు పెద్దగా బయటికి రాలేదు. పెళ్లయిన కొత్తలో ఎన్టీఆర్ తో కలిసి తన సినిమాల ఫంక్షన్లలో కొన్ని సందర్భాల్లో సందడి చేసింది. పిల్లలు పుట్టాక, ఫ్యామిలీతో ఫుల్ టైం గడుపుతుంది. అప్పుడప్పుడు ఫ్యామిలీ ఫోటోస్‌లో మాత్రమే కనిపిస్తుంటుంది.

అయితే ప్రణతి తాజాగా ట్విటర్‌లో అకౌంట్‌ను ఓపెన్ చేయడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక నుంచి ఎన్టీఆర్ కి సంబంధించిన అన్నీ అప్ డేట్స్ ను ఆమె రివీల్ చేస్తోందని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
Also Read: మాఘ అమావాస్య రోజు ఏ రాశి వారు ఏ వస్తువులను దానం చేస్తే.. ఎలాంటి ఫలితం కలుగుతుందో తెలుసా?
[…] Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ లేటెస్ట్ జబర్దస్త్ స్కిట్ యూట్యూబ్ లో సంచలనాలు నమోదు చేస్తుంది. రికార్డు వ్యూస్ తో దూసుకుపోతోంది. పుష్ప స్పూఫ్ గా తెరకెక్కిన నేపథ్యంలో స్కిట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. దేశం మొత్తం పుష్ప మేనియాతో ఊగిపోతుండగా జబర్దస్త్ కమెడియన్స్ సైతం పుష్ప చిత్రంపై స్కిట్స్ చేస్తున్నారు. జబర్దస్త్ షో టాప్ టీమ్స్ లో ఒకటిగా ఉన్న సుడిగాలి సుధీర్ టీమ్ పుష్ప స్పూఫ్ చేశారు. ఈ స్కిట్ లో సుధీర్ అల్లు అర్జున్ పుష్ప గెటప్ వేయగా, గెటప్ శ్రీను ఫహాద్ ఫాజిల్ చేసిన భన్వర్ లాల్ షెకావత్ గా, రామ్ ప్రసాద్ కేశవ గెటప్ వేయడం జరిగింది. […]