బీసీ పదవుల పంపకం.. వైసీపీలో కార్చిచ్చు

పేరు గొప్ప.. ఊరుదిబ్బ అన్నట్లుగా తయారైందని వైసీపీ పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక బీసీలోని 56 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్లు నేతలు గొప్పలు చెప్పుకున్నాయి. అయితే నేటి వరకు కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రభుత్వం ఎంపిక చేయలేదు. దీంతో బీసీ నేతలు అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. బీసీ కార్పొరేషన్ల పదవుల పంపకం ఆ పార్టీలో కార్చిచ్చును రగిల్చేలా కన్పిస్తుంది. ప్రస్తుతం వైసీపీ బీసీ కార్పొరేషన్ అధ్యక్షుడిగా జంగా కృష్ణమూర్తి […]

Written By: NARESH, Updated On : October 2, 2020 1:47 pm

ap ycp flag

Follow us on


పేరు గొప్ప.. ఊరుదిబ్బ అన్నట్లుగా తయారైందని వైసీపీ పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక బీసీలోని 56 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్లు నేతలు గొప్పలు చెప్పుకున్నాయి. అయితే నేటి వరకు కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రభుత్వం ఎంపిక చేయలేదు. దీంతో బీసీ నేతలు అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

బీసీ కార్పొరేషన్ల పదవుల పంపకం ఆ పార్టీలో కార్చిచ్చును రగిల్చేలా కన్పిస్తుంది. ప్రస్తుతం వైసీపీ బీసీ కార్పొరేషన్ అధ్యక్షుడిగా జంగా కృష్ణమూర్తి ఉన్నారు. ఆయన తన అనుచరులు.. పార్టీ కోసం కష్టపడిన నేతలకు పదవులు ఇవ్వాలని సిఫార్సు చేస్తున్నారు. అలాగే ఎన్నికల ముందు హామీలిచ్చి ఇతర పార్టీలోని బీసీ నేతలను ఆయన పార్టీల్లోకి ఆహ్వానించారు. వీరందరికీ కార్పొరేషన్లలో పదవులు దక్కేలా ఆయన సిఫార్సు చేయగా ఇతర వర్గాల నేతలు అడ్డుపడుతున్నారట.

పేరుకే బీసీ కార్పొరేషన్ అయినా చక్రం తిప్పదంతా రెడ్లేననే మాట విన్పిస్తోంది. నలుగురు రెడ్ల కనుసనుల్లోనే బీసీ కార్పొరేషన్ల పదవుల పంపకం జరుగుతుందనే టాక్ విన్పిస్తోంది. దీంతో బీసీ నేతలు జంగాకృష్ణమూర్తిని నిలదీస్తున్నారట. తాను సిఫార్సు చేసిన నేతలకు పదవులు దక్కకుండా వేరేవారికే ఛైర్మన్ పదవులను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పలువురు నేతలు ఆయన ఒత్తిడి తెస్తున్నారు. ఈ విషయంపై ఆయన ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో రేపోమాపో అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. అయితే చివరి నిమిషంలో జాబితా తారుమారు అయ్యేలా కన్పిస్తోంది. పార్టీపై అధికంగా ఒత్తిడి తెచ్చిన వారి పేర్లను జాబితాలో ఉంచుతున్నారు. మరికొందరు పేర్లను తొలగిస్తున్నారట. అయితే పదవుల పంపకంపై పలువురు బీసీ నేతలు అసంతృప్తితో ఉన్నారట.

దీంతో పార్టీ జాబితా ప్రకటించాక వైసీపీలో మరింత రాజకీయ వేడిరాజుకోనుంది. ప్రస్తుతానికి కార్పొరేషన్లకు పదవుల పంపకం మాత్రమే జరుగనుందని నిధులు కేటాయించే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో బీసీలు నేతలు కార్పొరేషన్ల నిధులపై ప్రభుత్వాన్ని నిలదీసి అసంతృప్తిని రగిల్చే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా కార్పొరేషన్లలో పదవుల పంపకం వైసీపీ కార్చిచ్చును రగిల్చేలా కన్పిస్తోంది.