Bodhan Constituency: ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కండోమ్ ప్యాకెట్లు..

ఇటీవల ఎన్నికల్లో ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా షకిల్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పోటీపడ్డారు. ఎమ్మెల్సీ కవిత షకిల్ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.

Written By: Anabothula Bhaskar, Updated On : December 5, 2023 5:55 pm

Bodhan Constituency

Follow us on

Bodhan Constituency: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ముఖ్యంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రచారం విస్తృతంగా సాగించిన నిజామాబాద్ జిల్లాలో భారత రాష్ట్ర సమితి నాయకులు ఓటమిపాలయ్యారు. ఆ స్థానాల్లో కాంగ్రెస్ నాయకులు, బిజెపి నాయకులు పాగా వేయగలిగారు. అలా భారత రాష్ట్ర సమితి నాయకులు ఓడిపోయిన నియోజకవర్గాలలో బోధన్ కూడా ఒకటి..ఈ నియోజకవర్గంలో మొన్నటిదాకా ఎమ్మెల్యేగా షకీల్ ఉండేవారు. ఈయన భారత రాష్ట్ర సమితికి చెందినవారు.

ఇటీవలి ఎన్నికల్లో..

ఇటీవల ఎన్నికల్లో ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా షకిల్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పోటీపడ్డారు. ఎమ్మెల్సీ కవిత షకిల్ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.. సుదర్శన్ రెడ్డి 3,062 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే ఓడిపోయిన ఎమ్మెల్యేలు ప్రభుత్వం తమకు కేటాయించిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేయాలి కాబట్టి.. షకీల్ అనుచరులు బోధన్ లో కార్యాలయాన్ని ఖాళీ చేసే పనిలో పడ్డారు. ఇన్ని రోజులపాటు షకీల్ ఉపయోగించిన సామాగ్రి మొత్తాన్ని డీసీఎం లో పెడుతున్నారు. అయితే అనుకోకుండా జరిగిన ఘటన ప్రస్తుతం బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును రాష్ట్రవ్యాప్తంగా మారుమోగేలా చేసింది.

ఇంతకీ ఏం జరిగిందంటే

షకీల్ క్యాంపు కార్యాలయంలో సామాగ్రిని ఇతర చోటుకు తరలిస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి వచ్చారు. ప్రభుత్వం సమకూర్చిన సామగ్రి మొత్తాన్ని షకీల్ తన ఇంటికి తరలిస్తున్నాడని ఆరోపించారు. అంతేకాదు ఆ డీసీఎం వాహనాన్ని అడ్డుకున్నారు. అక్కడ భారత రాష్ట్ర సమితి నాయకులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కొంతమంది సామాగ్రిని తరలిస్తుండగా అడ్డుకున్నారు. ఆ సమయంలో అక్కడ కండోమ్ ప్యాకెట్లు బయటపడ్డాయి. దీంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కండోమ్ ప్యాకెట్లు ఉండటమేంటని కాంగ్రెస్ నాయకులు నిలదీయగా.. భారత రాష్ట్ర సమితి నాయకులు అవి మీరే తెచ్చి షకిల్ ను బదనాం చేస్తున్నారంటూ ఎదురుదాడికి దిగారు. అయితే అక్కడ ఉన్న సిబ్బంది వీటిని వాడి ఉంటారని.. క్యాంపు కార్యాలయాన్ని అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగించారని అక్కడి స్థానికులు అంటున్నారు. మొత్తానికి ఓటమి బాధలో ఉన్న షకీల్ ను కండోమ్ ప్యాకెట్లు బయటపడ్డ వ్యవహారం మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. అసలు కండోమ్ ప్యాకెట్లు అక్కడికి ఎలా వచ్చాయని విషయంపై షకీల్ గతంలో తన వద్ద పనిచేసిన వ్యక్తులను ఆరా తీస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.