https://oktelugu.com/

కరోనాతో కన్నీరు పెడుతున్న పల్లెలు

ఏపీలో కరోనా దూకుడు కొనసాగుతూనే ఉంది. గడిచిన కొద్ది రోజులుగా కోవిడ్ ప్రభావంతో అతలాకుతలం అవుతోంది. పలు జిల్లాలు వణుకుతున్నాయి. పట్టణాల కంటే పల్లెల్లోనే కేసుల సంఖ్య ఎక్కువగా నమోదతుతోంది. ఏప్రిల్ తొలి వారంలో పట్టణాలు, నగరాల్లో 60 శాతం, పల్లెల్ల్లో 40 శాతం కేసులు వచ్చాయి. ఇప్పుడు పట్టణాల్లో 44 శాతం, పల్లెల్లో 57 శాతం కేసులు వస్తున్నాయి. దీంతో పల్లె కరోనా బారిన పడుతోందని తెలుస్తోంది. విచిత్రంగా పల్లెల్ల్లో తన ప్రభావాన్ని చూపడంతో జనం […]

Written By:
  • NARESH
  • , Updated On : May 19, 2021 10:50 am
    Follow us on

    Corona cases in APఏపీలో కరోనా దూకుడు కొనసాగుతూనే ఉంది. గడిచిన కొద్ది రోజులుగా కోవిడ్ ప్రభావంతో అతలాకుతలం అవుతోంది. పలు జిల్లాలు వణుకుతున్నాయి. పట్టణాల కంటే పల్లెల్లోనే కేసుల సంఖ్య ఎక్కువగా నమోదతుతోంది. ఏప్రిల్ తొలి వారంలో పట్టణాలు, నగరాల్లో 60 శాతం, పల్లెల్ల్లో 40 శాతం కేసులు వచ్చాయి. ఇప్పుడు పట్టణాల్లో 44 శాతం, పల్లెల్లో 57 శాతం కేసులు వస్తున్నాయి. దీంతో పల్లె కరోనా బారిన పడుతోందని తెలుస్తోంది. విచిత్రంగా పల్లెల్ల్లో తన ప్రభావాన్ని చూపడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఏం చేయాలో పాలుపోక నానా తంటాలు పడుతున్నారు. వైరస్ బారి నుంచి రక్షించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

    మూడు జిల్లాల్లోనే అధికంగా కేసులు
    ఏపీలో మూడు జిల్లాల్లోనే కోవిడ్ ప్రభావం అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరు, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాల్లో ఏప్రిల్ మొదటి వారంలో కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. గుంటూరులో 8.56 శాతం, విశాఖలో 8.30 శాతం, చిత్తూరులో 8.24 శాతం కేసులు బయటపడ్డాయి. దీంతో కరోనా ప్రభావంతో ఈ మూడు జిల్లాలు పోరాడాయి. వైరస్ వ్యాప్తిని తగ్గించుకునే పనిలో భాగంగా పలు చర్యలు తీసుకున్నాయి.

    పెరిగిన పాజిటివిటీ రేటు
    మే నెలలో పాజిటివిటీ రేటు అధికమైంది. తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల్లో కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగాయి. తూర్పుగోదావరిలో 38 శాతం, అనంతపురంలో 36 శాతం, కడపలో 29 శాతం మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. దీంతో ఏపీలో కరోనా రక్కసిని రూపుమాపే పనిలో భాగంగా కర్ఫ్యూ విధించారు. అయితే కర్ఫ్యూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఫలితంగా కేసుల సంఖ్య నానాటికి పెరుగూతే ఉన్నాయి. అయినా ప్రభుత్వం లాక్ డౌన్ విధించే ఆలోచన చేయడం లేదు.

    కరోనా ప్రభావం తగ్గేనా?
    ఏపీలో కరోనా ప్రభావం తగ్గడానికి తగు చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా కరోనా వైరస్ వ్యాప్తి విపరీతంగా పెరిగిపోతోంది. దేశంలోనే రెండో రాష్ర్టంగా ఏపీ రికార్డులకెక్కుతోంది. దీనికి కారణం నివారణ చర్యలు తీసుకోకపోవడమే. అన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ విధిస్తుంటే ఒక్క ఏపీలో మాత్రం లాక్ డౌన్ అవసరం లేదని కర్ఫ్యూనే కొనసాగిస్తున్నారు. దీంతో కేసుల సంఖ్యలో ఏం తేడా లేకుండా పోతోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. అయినా పాలకుల్లో నిర్లక్ష్యం తొలగడం లేదు. ప్రజల బతుకు మారడంలేదు.