వకీల్ సాబ్ ఆపేయాలని ఫిర్యాదు.. ఈసీ నిర్ణయమిదీ

వకీల్ సాబ్ తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు రిలీజ్ అయ్యి రికార్డులు సృష్టిస్తోంది. పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో సినిమాకు ఊహించలేనంతగా రెస్పాన్స్ వస్తోంది.అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా మీద ఏపీలో ఆంక్షలు పెట్టారని.. టికెట్ రేటు పెంచకుండా ఏపీ సర్కార్ కక్ష్య సాధింపు చర్యలు చేపట్టిందని విమర్శలు వస్తున్నాయి. దీన్నిబట్టి పవన్ కళ్యాన్ రాజకీయాలు ఆయన సినిమాలపై కూడా ప్రభావం చూపిస్తున్నాయని అర్థమవుతోంది. పవన్ ‘వకీల్ సాబ్’ సినిమాపై తాజాగా ఓ వ్యక్తి కేంద్ర ఎన్నికల […]

Written By: NARESH, Updated On : April 9, 2021 11:43 am
Follow us on

వకీల్ సాబ్ తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు రిలీజ్ అయ్యి రికార్డులు సృష్టిస్తోంది. పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో సినిమాకు ఊహించలేనంతగా రెస్పాన్స్ వస్తోంది.అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా మీద ఏపీలో ఆంక్షలు పెట్టారని.. టికెట్ రేటు పెంచకుండా ఏపీ సర్కార్ కక్ష్య సాధింపు చర్యలు చేపట్టిందని విమర్శలు వస్తున్నాయి.

దీన్నిబట్టి పవన్ కళ్యాన్ రాజకీయాలు ఆయన సినిమాలపై కూడా ప్రభావం చూపిస్తున్నాయని అర్థమవుతోంది. పవన్ ‘వకీల్ సాబ్’ సినిమాపై తాజాగా ఓ వ్యక్తి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం కలకలం రేపింది.

తిరుపతిలో పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని ఆపేయాలని నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన మెరువ నరేంద్ర కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి పోటీలో ఉన్నారని.. పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. వకీల్ సాబ్ మూవీ ఓటర్లపై ప్రభావం చూపుతుందని.. ఈ చిత్రాన్ని నిలిపివేయాలని ఈసీని కోరారు.

ఈ ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ప్రభుత్వ పరిధిలోని దూరదర్శన్ చానెల్ లో తప్ప ఎందులో ప్రచారం అయినా ఎన్నికల నిబంధనల కిందకు రాదని సీఈసీ స్పష్టం చేసింది. వకీల్ సాబ్ రిలీజ్ ఏపీలో ఎన్నికల నియమావళి పరిధిలోకి రాదని వెల్లడించింది. దీంతో పవన్ సినిమాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోయాయి.