https://oktelugu.com/

Indian Coast Guard: చుట్టూ సంద్రం.. భారత్ ఏం చేస్తుందిలే అనుకుంది.. పిచ్చి పాకిస్తాన్.. లేపి తన్నించుకోవడం అంటే ఇదే మరి..

చుట్టూ సముద్రం.. పైగా తన మారిటైం(సముద్ర ప్రాంతం) సరిహద్దు.. భారత్ ఏం చేస్తుందిలే అనుకుంది.. కానీ పాకిస్తాన్ కు అసలు సినిమా తర్వాత అర్థమైంది. ఆ తర్వాత కాళ్ల బేరానికి వచ్చింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ సాహసం ముందు తలవంచింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 19, 2024 / 10:34 AM IST

    Indian Coast Guard

    Follow us on

    Indian Coast Guard: ఇండియన్ కోస్ట్ గార్డెన్ నౌక అగ్రిమ్.. సముద్ర జలాల్లో నిత్యం గస్తీ తిరుగుతుంది. ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి దొంగ చాటుగా నౌకలు మన జలాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. గతంలో ముంబై దాడులకు పాల్పడేందుకు పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు సముద్రమార్గం మీదుగానే మనదేశంలోకి వచ్చారు. అందువల్లే మనదేశ కోస్ట్ గార్డ్ సముద్ర జలాలపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టింది. అధునాతన సాంకేతిక పరికరాల సహాయంతో సముద్ర జలాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. పాకిస్తాన్ నుంచి దొంగచాటుగా నౌకలు మనదేశంలోకి ప్రవేశించకుండా సమర్థవంతంగా అడ్డుకుంటున్నది.. అయితే ఆదివారం భారత కోస్ట్ గార్డ్ అగ్రీమ్ గస్తీ తిరుగుతోంది. సరిగ్గా మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాల ప్రాంతంలో చేపల పేట నిషేధించిన ప్రాంతంలో భారతదేశానికి చెందిన చేపల పడవ నుంచి ఒక హెచ్చరిక కాల్ వచ్చింది. “పాకిస్తాన్ నౌక నుస్రత్ భారతీయ చేపల పడవ కాలభైరవ్ ను స్వాధీనం చేసుకుందని.. అందులో ఉన్న ఏడుగురు మత్స్యకారులను తీసుకెళ్లి పోతుందని” ఆ ఫోన్ కాల్ ఉద్దేశం.. దీంతో భారత కోస్ట్ గార్డ్ నౌక అగ్రీమ్ రంగంలోకి దిగింది. పాకిస్తాన్ నౌకను అడ్డుకున్నది. అంతేకాదు అందులోని భారతీయులందరినీ విడిపించింది.

    కాలభైరవ్ మునిగిపోయింది

    మన దేశ మత్స్యకారులను రక్షించే క్రమంలో భారత కోస్ట్ గార్డ్ నౌక అగ్రీమ్ సాహసోపేతమైన ఆపరేషన్ చేసింది. పాకిస్తాన్ నౌక కు చుక్కలు చూపించింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు మొదలైన ఆపరేషన్ సాయంత్రం దాకా కొనసాగింది. అయితే భారత దూకుడు వల్ల పాకిస్తాన్ పోస్ట్ గార్డ్ సిబ్బంది తోక ముడిచారు. అయితే ఈ ఆపరేషన్లో భారత్ విజయం సాధించినప్పటికీ.. భారత మత్స్యకారుల పడవ కాలభైరవ్ దెబ్బతిన్నది. సముద్రంలో మునిగిపోయింది. ఇక ఆపరేషన్ విజయవంతంగా ముగించిన అనంతరం అగ్రిమ్ నౌక సోమవారం ఓఖా హార్బర్ కు తిరిగి వచ్చింది. ఈ ఆపరేషన్ కు సంబంధించి ఇండియన్ కోస్ట్ గార్డ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో విషయాలను వెల్లడించింది. ” పాకిస్తాన్ మన దేశానికి చెందిన మత్స్యకారులను తీసుకెళ్తోంది. మాకు వెంటనే సమాచారం వచ్చింది. రెండవ మాటకు తావు లేకుండా మేము రంగంలోకి దిగాం. సముద్రంలో హోరాహోరీ ఆపరేషన్ తర్వాత మన దేశానికి చెందిన మత్స్యకారులను విడిపించాం. సురక్షితంగా మన దేశానికి తీసుకురాగలిగాం. కాకపోతే వారు చేపలను వేటాడేందుకు ఉపయోగించే పడవ ధ్వంసం అయింది. అది సముద్రంలో మునిగిపోయింది. అయితే పాకిస్తాన్ అక్రమంగా మన మత్స్యకారులను తీసుకెళ్లడానికి ప్రయత్నించింది. దానిని మేము ప్రారంభంలోనే అడ్డుకున్నాం. పాకిస్తాన్ కుట్రలు విజయవంతం కాకుండా నిలువరించగలిగాం. అందువల్లే పాకిస్తాన్ తోకముడిచింది. మేము చేపట్టిన సాహసోపేతమైన ఆపరేషన్ ముందు తలవంచిందని” ఇండియన్ కోస్ట్ గార్డు బృందం ట్విట్టర్లో వ్యాఖ్యానించింది. కాగా, ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది చేసిన సాహసోపేతమైన ఆపరేషన్ ను నెటిజన్లు కొనియాడుతున్నారు. పాకిస్తాన్ నిద్రపోతున్న సింహాన్ని లేపి మరి తన్నించుకుందని పేర్కొంటున్నారు..