https://oktelugu.com/

Jagan Praja Sankalpa Yatra: జగన్ ‘ప్రజా సంకల్ప యాత్ర’కు నేటితో మూడేళ్లు.. ఏమేం చేశారంటే..?

Jagan Praja Sankalpa Yatra: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి..2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. అయితే, ఆయన అధికారంలోకి రావడానికి ఆయన సుదీర్ఘ కాలం పాటు చేసిన పాదయాత్ర ఉపయోగపడిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైసీపీ అధినేత జగన్ ప్రతిపక్ష నేత హోదాలో సుదీర్ఘ కాలం పాటు పాదయాత్ర చేశారు. ప్రజల కష్టాలను తెలుసుకుంటానని చెప్తూ జగన్ 3,648 కిలోమీటర్ల దూరం […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 9, 2022 / 12:55 PM IST
    Follow us on

    Jagan Praja Sankalpa Yatra: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి..2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. అయితే, ఆయన అధికారంలోకి రావడానికి ఆయన సుదీర్ఘ కాలం పాటు చేసిన పాదయాత్ర ఉపయోగపడిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైసీపీ అధినేత జగన్ ప్రతిపక్ష నేత హోదాలో సుదీర్ఘ కాలం పాటు పాదయాత్ర చేశారు. ప్రజల కష్టాలను తెలుసుకుంటానని చెప్తూ జగన్ 3,648 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశారు. జగన్ తన సొంత జిల్లా కడపలోని ఇడుపుల పాయలో గల వైఎస్ఆర్ ఘాట్ వద్ద 2017 నవంబర్ 6న పాదయాత్ర స్టార్ట్ చేశారు. ఆ పాదయాత్ర 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగిసింది. అలా పాదయాత్ర ముగిసి నేటికి మూడేళ్లవుతున్నది.

    Jagan Praja Sankalpa Yatra

    పాదయాత్రలో ప్రజల తన వెంట నడిచారు. ఈ క్రమంలోనే ఎన్నికల సమయం వచ్చే సరికి ఆయన వైపున నిలబడి ఆయనకు రాజకీయ అధికారం అప్పజెప్పారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూనే జగన్ 341 రోజుల పాటు పాదయాత్ర చేశారు. 2,516 గ్రామాల గుండా పాదయాత్ర సాగగా, 134 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలను జగన్ ప్రత్యక్షంగా కలుసుకున్నారు. 124 బహిరంగ సభలను నిర్వహించారు. ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అనే నినాదంతో ఈ పాదయాత్ర అద్భుతం సాగింది.

    శ్రీకాకుళం జిల్లాలోని ఒడిశా సరిహద్దు పట్టణం ఇచ్ఛాపురం వద్ద 2019లో జనవరి 9న పాదయాత్రను జగన్ ముగించారు. ఈ సందర్భంగా భారీ పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం అక్కడి నుంచి రైలులో నేరుగా తిరుపతికి వెళ్లి, తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అలిపిరి మెట్ల మార్గం మీదుగా కాలినడకన తిరుమలకు చేరకున్నారు. ఇక ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఎవరూ ఊహించని విధంగా ఘన విజయం సాధించింది. 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుంది.

    వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా ప్రజల నుంచి పలు విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ క్రమంలోనే వారి విన్నపాలు, కోరికల ఆధారంగ నవరత్న పథకాలను రూపొందించారు. ‘రైతు భరోసా, ఆరోగ్య శ్రీ, అమ్మ ఒడి, పేదలందరికీ ఇళ్లు, పింఛన్ల పెంపు, వైఎస్ఆర్ చేయూత’ వంటి రకరకాల పథకాలను అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చారు. తన మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలన్నిటినీ జగన్ అమలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

    Also Read: Jagan Decision: జగన్ నిర్ణయం.. వాట్సాప్ గ్రూపుల నుంచి ఉద్యోగులు నిష్క్రమణ

    ప్రజల సంక్షేమానికే వైసీపీ సర్కారు మొద‌టి ప్రాధాన్య‌త అని ఈ సందర్భంగా వైసీపీ నేతలు చెప్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేయడమే లక్ష్యంగా తమ సర్కారు ముందుకు సాగుతున్నదని ఈ సందర్భంగా వైసీపీ నేతలు వివరిస్తున్నారు కూడా. ఇకపోతే వైఎస్ జగన్ పాదయాత్ర మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు అభిమానులు సోషల్ మీడియాలో ‘త్రీ ఇయర్స్ ఫర్ ప్రజా సంకల్ప యాత్ర’ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. వైఎస్ జగన్‌తో తాము పాదయాత్ర సందర్భంగా దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. పాదయాత్రలో వేసిన అడుగుల ద్వారా నేటి ప్రజా రంజక పాలనకు అడుగులు పడ్డాయని కామెంట్స్ చేస్తున్నారు.

    Also Read: Chandrababu: పొత్తుల ఎత్తులు.. 2024లో చంద్రబాబు ప్లాన్ బి ఇదే

    Tags