spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Jagan- KCR: జగన్‌ దేశంలోనే ధనిక సీఎం.. కేసుల్లో మన కేసీఆర్‌ టాప్‌.. ముగ్గురు భార్యల...

Jagan- KCR: జగన్‌ దేశంలోనే ధనిక సీఎం.. కేసుల్లో మన కేసీఆర్‌ టాప్‌.. ముగ్గురు భార్యల ముద్దుల ముఖ్యమంత్రి ఆయన..! 

Jagan- KCR: అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించిన వ్యక్తిగత ఆస్తులు, స్థిరాస్తులు, క్రిమినల్‌ కేసులు, విద్యార్హత, గన్‌ లైసెన్సులు, అత్యధిక వాహనాలు.. ఇలా ఏడు అంశాలకు సంబంధించిన కీలక సమాచారం వెలువడింది. ప్రముఖ ఇంగ్లిష్‌ వెబ్‌సెట్‌ ‘ది ప్రింట్‌’ దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. వారు దాఖలు చేసిన అఫిడవిట్స్‌ను దీనికి ప్రాతిపదికగా తీసుకుంది. దేశవ్యాప్తంగా 20 మంది ముఖ్యమంత్రులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని ఇందులో పొందుపరిచింది.

Jagan- KCR
Jagan- KCR

ధనిక సీఎం జగన్‌..
దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేవ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ.370 కోటు. వారసత్వంగా ఆయనకు అందిన వాటితోపాటు రాజకీయాల్లోకి రాకముందు ఓ పారిశ్రామికవేత్తగా ఆయన ఈ ఆస్తులను సంపాదించారు. స్థిరాస్తుల్లోనూ జగన్‌ టాప్‌లో ఉన్నారు. ఈ కేటగరీో రెండోస్థానంలో అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమాఖండు ఉన్నారు. ఆయన ఆస్తులు రూ.132 కోట్లు

పేద ముఖ్యమంత్రి మమత..
అతి తక్కువ ఆస్తులు ఉన్న ముఖ్యమంత్రిగా పశ్చిమబెంగాల్‌ సీఎం మమత బెనర్జీ అట్టడుగున నిలిచారు. ఆమె ఆస్తుల విలువ కేవలం రూ.15 లక్షలు మాత్రమే. ఆమె తరువాత కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ రూ.72 లక్షలు, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ రూ.56 లక్షలు, కర్ణాటక, హర్యానా ముఖ్యమంత్రు బసవరాజ్‌ బొమ్మై, మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ రూ.1.37 కోట్లు, రూ.1.27 కోట్లతో ఆ తరువాతి స్థానాల్లో ఉన్నారు.

ఆయన ముగ్గురు పెళ్లాల ముఖ్యమంత్రి..
ఇప్పుడున్న ముఖ్యమంత్రుల్లో అయిద ుమంది అవివాహితులు ఉన్నారు. మనోహర్‌ లాల్‌ఖట్టర్‌– హర్యానా, నవీన్‌ పట్నాయక్‌– ఒడిశా, యోగి ఆదిత్యనాథ్‌–ఉత్తర ప్రదేశ్, ఎన్‌.రంగస్వామి– పుదుచ్చేరి, మమత బెనర్జీ – పశ్చిమ బెంగాల్‌ అవివాహితులు. సిక్కిం ముఖ్యమంత్రి తమాంగ్‌ బహు భార్యత్వాన్ని కలిగి ఉన్నారు. ఆయనకు ముగ్గురు భార్యలు ఉన్నారు. ఆ ముగ్గురు కూడా ప్రభుత్వ ఉద్యోగులే కావడం గమనార్హం.

క్రిమినల్‌ కేసుల్లో కేసీఆర్‌ టాప్‌..
ముఖ్యమంత్రులందరిలోనూ అత్యధిక క్రిమినల్‌ కేసులు ఉన్నది తెలంగాణ సీఎం కేసీఆర్‌పైనే. ఈ కేటగిరీలో రెండో స్థానంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్‌ ఉన్నారు. స్టాలిన్‌పై 47 కేసులు నమోదయ్యాయి. వైఎస్‌జగన్‌పైనా చెప్పుకోదగ్గ స్థాయిలో కేసులు ఉన్నాయి. వాటి సంఖ్య 38. అశోక్‌ గెహ్లాట్‌–రాజస్థాన్, మమతా బెనర్జీ, నవీన్‌ పట్నాయక్, సంగ్మా–మేఘాలయా, రియో–నాగాలాండ్, రంగస్వామిపై ఎలాంటి నేరారోపణలు లేవు. బీజేపీకి చెందిన 10 మంది ముఖ్యమంత్రులు కూడా క్లీన్‌ చిట్‌లో ఉన్నారు.

Jagan- KCR
Jagan- KCR

వారివద్ద ఎక్కువ వాహనాలు..
మనోహర్‌ లాల్‌ ఖట్టర్, పినరయి విజయన్, అశోక్‌ గెహ్లాట్, ఎంకే. స్టాలిన్, కేసీఆర్, యోగి ఆదిత్యనాథ్, పుష్కర్‌ సింగ్‌ ధామి–ఉత్తరాఖండ్, మమత బెనర్జీలకు సొంత వాహనాలు లేవని అఫిడవిట్‌లు చెబుతున్నాయి. వైఎస్‌.జగన్‌కు నాలుగు సొంత వాహనాలు ఉన్నాయి. అందులో మూడు స్కార్పియోలు, ఒకటి బీఎండబ్ల్యూ. ఈ కేటగిరీలో పెమా ఖండూ తొలి స్థానంలో నిలిచారు. ఆయన వద్ద ఏడు వాహనాలు ఉన్నాయి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...

Jana Nayagan Movie: జన నాయకుడు మూవీ నుంచి తప్పించుకున్న స్టార్ డైరెక్టర్…

Jana Nayagan Movie: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న నటీనటులు చాలామంది ఉన్నారు. అక్కడ హీరోలు ఎంతమంది ఉన్నప్పటికి దళపతి విజయ్ కి ఉన్న క్రేజ్ నెక్స్ట్...

Pink Diamond Conspiracy: తేలిపోనున్న ‘పింక్ డైమండ్’ కుట్ర!

Pink Diamond Conspiracy: 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేసింది. 2014 నుంచి 2019 వరకు టిడిపి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు చేయని ప్రయత్నం అంటూ...

Bhogapuram International Airport: ‘భోగాపురం’లో రెండు గంటల పాటు మోడీ!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. విభజన హామీల్లో భాగంగా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ...

Thammineni Seetharam Case: తమ్మినేని సూత్రధారి.. కోర్టులో సంచలనం!

Thammineni Seetharam Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన అధికార దర్పాన్ని ఉపయోగించి.. నకిలీ పత్రాలతో కుమారుడి పేరుతో నాలుగు కోట్ల రూపాయల విలువైన...
Oktelugu Epaper
Exit mobile version