https://oktelugu.com/

పాల్ఘర్ ఘటనని ఆ కోణంలో చూడొద్దు:ఉద్దవ్

మహారాష్ట్రలోని, పాల్ఘర్ లో ఏప్రిల్ 17న జరిగిన ఘటన హిందూ-ముస్లింలకు సంబంధించినది కాదని ఆ రాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే స్పష్టం చేశారు. ఈ విషయంపై నేడు కేంద్ర హోంశాఖ వివరణ కోరగా ఉద్దవ్ స్పందించారు. ఇంతకు ముందు ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయని ఈ ఘటనను హిందూ-ముస్లింల మధ్య గొడవగా భావించవద్దని సీఎం తెలిపారు. Also Read:పాల్ఘర్ లో అసలేమీ జరిగింది? ఈ సందర్బంగా సీఎం ఉద్దవ్ మాట్లాడుతూ.. “ఇద్దరు సాధువులు, వాళ్ళ డ్రైవర్ మొత్తం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 20, 2020 / 04:04 PM IST
    Follow us on

    మహారాష్ట్రలోని, పాల్ఘర్ లో ఏప్రిల్ 17న జరిగిన ఘటన హిందూ-ముస్లింలకు సంబంధించినది కాదని ఆ రాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే స్పష్టం చేశారు. ఈ విషయంపై నేడు కేంద్ర హోంశాఖ వివరణ కోరగా ఉద్దవ్ స్పందించారు. ఇంతకు ముందు ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయని ఈ ఘటనను హిందూ-ముస్లింల మధ్య గొడవగా భావించవద్దని సీఎం తెలిపారు.

    Also Read:పాల్ఘర్ లో అసలేమీ జరిగింది?

    ఈ సందర్బంగా సీఎం ఉద్దవ్ మాట్లాడుతూ.. “ఇద్దరు సాధువులు, వాళ్ళ డ్రైవర్ మొత్తం ముగ్గురు వ్యక్తులు దాద్రా నగర్ హవేలీ వెళ్ళడానికి ప్రయత్నిచారు కానీ లాక్ డౌన్ కారణంగా వారిని బోర్డర్ ప్రాంతమైన పాల్ఘర్ గ్రామం వద్ద అధికారులు అడ్డుకున్నారు. వారు తల దాచుకోవడానికి ఆ గ్రామంలోకి వెళ్లారు. అప్పటికే ఆ ప్రాంతాలలో దొంగలు వస్తున్నారనే వార్త బాగా వైరల్ అయింది.దింతో ఆ వ్యాన్ లో ఉన్న ముగ్గుర్ని అనుమానంతో ఆ గ్రామస్థులు కొట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేసుకున్నారు కానీ గ్రామస్థుల దాడిని ఆపలేకపోయారు. దింతో ఆ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అయితే సంఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న ఆరుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసినట్లు ఉద్దవ్ స్పష్టం చేశారు.

    ఈ కేసుకి సంబంధించి 110 మందిని అదుపులోకి తీసుకున్నామని, మరి కొంత మంది పరారీలో ఉన్నారని వారిని కూడా త్వరలోనే పట్టుకొని శిక్ష విధిస్తామని ఉద్దవ్ తెలిపారు.ఇది రిమోట్ ఏరియా కావడంతో వదంతులు ఎక్కువగా పుట్టాయి తప్పా ఇది హిందూ-ముస్లిం ల మధ్య గొడవ కాదని మరోసారి సీఎం స్పష్టం చేశారు.