CM Resign: సంచలనం.. సీఎం పదవికి రాజీనామా?

  CM Resign: ఈ కాంగ్రెస్ లో ఇంతేనబ్బా.. ఒకరు ఎదగరు.. ఎదిగినవారిని కుదురుగా చేసుకోనివ్వరు.. బలమైన నేతలను కూడా పొగబెట్టి సాగనంపే సంస్కృతి ఈ 100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీలో కామన్. తాజాగా పంజాబ్ కాంగ్రెస్ సీఎం అమరీందర్ సింగ్(Amareendar singh) కూడా రాజీనామాకు సిద్ధపడ్డారు. పీసీసీ చీఫ్, ప్రముఖ క్రికెటెర్ నవజ్యోతి సింగ్(Navajyoth singh siddu) సిద్ధుకు, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కు మధ్య విభేదాలతో కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. అమరీందర్ […]

Written By: NARESH, Updated On : September 18, 2021 12:45 pm
Follow us on

 

CM Resign: ఈ కాంగ్రెస్ లో ఇంతేనబ్బా.. ఒకరు ఎదగరు.. ఎదిగినవారిని కుదురుగా చేసుకోనివ్వరు.. బలమైన నేతలను కూడా పొగబెట్టి సాగనంపే సంస్కృతి ఈ 100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీలో కామన్. తాజాగా పంజాబ్ కాంగ్రెస్ సీఎం అమరీందర్ సింగ్(Amareendar singh) కూడా రాజీనామాకు సిద్ధపడ్డారు. పీసీసీ చీఫ్, ప్రముఖ క్రికెటెర్ నవజ్యోతి సింగ్(Navajyoth singh siddu) సిద్ధుకు, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కు మధ్య విభేదాలతో కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. అమరీందర్ క్యాబినెట్ నుంచి బయటకొచ్చి అసమ్మతి రాజేశాడు సిద్దూ..

ఈక్రమంలోనే కాంగ్రెస్ అధిష్టానం సిద్దూను పీసీసీ చీఫ్ ను చేసి అమరీందర్ తో కలిసి సామరస్యంగా వెళ్లాలని సూచించింది. అయితే అది సాధ్యం కాలేదు. అమరీందర్ ప్రభుత్వాన్ని అస్తిరపరిచేలా సిద్దూ వ్యవహరించాడనే ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యేలు కూడా సిద్దూకు, అమరీందర్ కు మధ్య చీలిపోయారు.

వచ్చే ఏడాది పంజాయ్ ఎన్నికలు ఉండడంతో కాంగ్రెస్ అధిష్టానం సిద్దూ, అమరీందర్ మధ్య సయోధ్యకు ఎంతగానో ప్రయత్నించింది. కానీ సిద్దూ పొడగిట్టని అమరీందర్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. తాను వద్దు అంటున్న సిద్దూకు పెద్దపీట వేయడాన్ని అమరీందర్ జీర్ణించుకోవడం లేదు. అందుకే తాజా పరిణామాలతో తాను విసిగిపోయానని సీఎం అమరీందర్ సింగ్ అధిష్టానానికి తెలిపినట్లు సమాచారం. ఈక్రమంలోనే సీఎం పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అమరీందర్ ఈరోజు సీఎల్పీ మీటింగ్ పెట్టారు. అంతకుముందే గవర్నర్ కు రాజీనామా లేఖ అందించే అవకాశం ఉందని సమాచారం. దీంతో ఈరోజు సీఎల్పీలో అమరీందర్ వారసుడిగా తర్వాత పంజాబ్ సీఎం ఎవరు అవుతారన్నది ఆసక్తి రేపుతోంది.