https://oktelugu.com/

Telangana New Secretariat- CM KCR: ఘనంగా సచివాలయం ప్రారంభోత్సవం: ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి సంతకం దానిపైనే

వాస్తవానికి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశం ఇప్పటిది కాదు. 2014 ఎన్నికల్లోనే భారత రాష్ట్ర సమితి తన మేనిఫెస్టోలో ప్రకటించింది. ఆ తర్వాత 2018 ఎన్నికల దాకా ఆ అంశాన్ని పొడిగించుకుంటూ వచ్చింది. 2018 ఎన్నికల్లో కూడా ఇదే అంశాన్ని మళ్లీ ప్రస్తావించింది.

Written By: , Updated On : May 1, 2023 / 09:11 AM IST
Follow us on

Telangana New Secretariat- CM KCR: తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. పేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయాన్ని ప్రారంభించారు. మంత్రులు, అధికారుల సమక్షంలో ఆరో అంతస్తులో తన ఛాంబర్ లో ఆయన ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా కీలక ఆరు దస్త్రాలపై ఆయన సంతకాలు చేశారు. అనంతరం ఆయనను వివిధ శాఖల మంత్రులు, అధికారులు అభినందించారు. పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.

తొలి సంతకం దానిపైన

తన చాంబర్లో ఆసీనుడైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కీలకమైన ఆరు దస్త్రాలపై సంతకాలు చేశారు. అందులో మొదటిది కాంట్రాక్టుల క్రమబద్ధీకరణ ఫైల్, పోడు భూములకు సంబంధించిన మరో ఫైల్ పై కూడా ముఖ్యమంత్రి సంతకాలు చేశారు. ఎన్నికల సందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగుల్లో సంతోషం నింపారు. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన మాట నిలుపుకున్నందుకు కేసిఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. అంతకుముందు ఎలక్ట్రిక్ వాహనంలో పలు చాంబర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. వివిధ శాఖల అధికారులు ఆరో అంతస్తులో కల్పించిన సౌకర్యాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు వివరించారు. అంతేకాదు వివిధ చాంబర్లను ఆయనకు చూపించి, అందులో గల ప్రత్యేకతలను ముఖ్యమంత్రి కి ప్రజెంటేషన్ ద్వారా చూపించారు.

ఇప్పటికైనా అమలైంది

వాస్తవానికి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశం ఇప్పటిది కాదు. 2014 ఎన్నికల్లోనే భారత రాష్ట్ర సమితి తన మేనిఫెస్టోలో ప్రకటించింది. ఆ తర్వాత 2018 ఎన్నికల దాకా ఆ అంశాన్ని పొడిగించుకుంటూ వచ్చింది. 2018 ఎన్నికల్లో కూడా ఇదే అంశాన్ని మళ్లీ ప్రస్తావించింది. అయితే ప్రభుత్వం మీద నమ్మకం ఉంచిన కాంట్రాక్టు ఉద్యోగులు క్రమబద్దీకరిస్తుందనే ఆశతో ఉన్నారు. 2021 ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఆశపెట్టింది. చివరికి దానిని 2023 వరకు ప్రభుత్వం నాన్చింది.. మరో ఆరు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆగమేఘాల మీద ఈ నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ సంతకం చేసిన నేపథ్యంలో టుమారో 15000 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు సర్కారీ నౌకరి దక్కింది. వాస్తవానికి కాంట్రాక్టు ఉద్యోగులు 20కి మించి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. చాలీచాలని వేతనంతో జీవితాలను ఈడ్చుకొస్తున్నారు.. అప్పట్లో వీరిని క్రమబద్ధీకరిస్తామని కెసిఆర్ హామీ ఇచ్చారు. ఆ హామీని నిలుపుకునేందుకు తొమ్మిది సంవత్సరాల సమయం తీసుకున్నారు.

ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే

కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించిన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపి నాయకులు స్పందించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల ఉసురు పోసుకున్న ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి వారిని క్రమబద్ధీకరించిందని తెలిపారు.. మరో ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, లేకపోతే ఆ ఫైల్ పై ముఖ్యమంత్రి సంతకం చేసేవారు కాదన్నారు. ఇన్నాళ్లు ఆయన చాంబర్లో ఈ ఫైలు ముక్కి మూలిగి ఉందన్నారు. ఆయన సెక్రటేరియట్ కి వెళ్తే ఈ ఫైల్ గురించి తెలిసేదని, ఫామ్ హౌస్ లో ఉన్నందున దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదని వారు విమర్శించారు. ఇప్పటికైనా కాంట్రాక్టు ఉద్యోగుల కష్టాలు తీరాయని వారు పేర్కొన్నారు.