https://oktelugu.com/

మాటల్లో కాదు చేతల్లో చూపించాం: కేసీఆర్

చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి, వాక్ శుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రూ.64.70 కోట్లతో 93.33 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్ ను ప్రారంభించారు.మండేపల్లిలో డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించారు. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్, ట్రైనింగ్ రీసెర్చి కేంద్రం, నర్సింగ్ కళాశాలను సైతం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఆరేళ్లలో వ్యవసాయ రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నామని చెప్పారు. గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు రూ.8 […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : July 4, 2021 / 07:29 PM IST
    Follow us on

    చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి, వాక్ శుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రూ.64.70 కోట్లతో 93.33 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్ ను ప్రారంభించారు.మండేపల్లిలో డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించారు. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్, ట్రైనింగ్ రీసెర్చి కేంద్రం, నర్సింగ్ కళాశాలను సైతం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఆరేళ్లలో వ్యవసాయ రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నామని చెప్పారు. గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు రూ.8 వేల కోట్లతో పథకాన్ని రూపొందించామని పేర్కొన్నారు.

    త్వరలో రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తామని వివరించారు. రాష్ర్టంలో గత రెండేళ్లలో 135 శాతం ఎక్కు వ వర్షపాతం నమోదైందని చెప్పారు. మిషన్ కాకతీయతో చెరువులు, కుంటలు నింపి వ్యవసాయానికి ఆటంకం లేకుండా చేశామని తెలిపారు. మిసన్ కాకతీయ ఫలాలు ఇప్పుడు రైతులు అందుకుంటున్నారన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంతో రైతులకు రెండు పంటలకు నీరు అందించేందుకు ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొన్నారు. రైతుల కన్నీళ్లు తుడిచే ప్రభుత్వం ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు.

    గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా వృద్ధాప్య పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. వచ్చే నెల నుంచి 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు అందజేస్తామని పేర్కొన్నారు. ఎస్సీల అభివృద్ధి కోసం రాబోయే నాలుగేళ్లలో రూ.45 వేల కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. నర్సింగ్ విద్యార్థులకు స్టైఫండ్ పెంచుతున్నామని చెప్పారు. వచ్చే విడతలో రాజన్న సిరిసిల్లకు కచ్చితంగా వైద్య కళాశాల వస్తుందన్నారు. త్వరలో చేనేత కార్మికులు, మరమగ్గాల వారు మరణిస్తే రూ.5 లక్షల బీమా, సిరిసిల్లలో కమ్యూనిటీ హాల్ కోసం రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నామని వివరించారు.

    సీఎం కేసీఆర్ సిరిసిల్లకువరాలు కురిపించారు. సాగునీటి ప్రాజెక్టులతో రాష్ర్టం సస్యశ్యామలంగా మారిందని చెప్పారు. మిడ్ మానేరు జలాశయంతో ఈ ప్రాంత ప్రజల సమస్యలు తీరాయని పేర్కొన్నారు. ఆయకట్టు పెరిగిందని సూచించారు. రెండు పంటలు బాగా పండుతున్నాయని వివరించారు. ఒకప్పుడు కరువు తాండవం చేసే ప్రాంతాన్ని నీటితో తడిపిన ఘనత తమదేనని తెలిపారు. ఇందుకు ప్రజల సహకారం ఉందని అన్నారు. రాబోయే కాలంలో కూడా ఇంకా మంచిపనులు చేసేందుకు వెనుకాడబోమని తేల్చి చెప్పారు.