అలనాటి అందాల భామ భాగ్యశ్రీకి స్వీట్లు అంటే భలే ఇష్టం. అప్పుడెప్పుడో ‘మైనే ప్యార్ కియా’తో వెండితెర పై తన అందచందాలను విచ్చలవిడిగా ప్రదర్శించి.. మొత్తానికి అప్పటి కుర్రాళ్లకు ఫుల్ కిక్ ఇచ్చింది బానుశ్రీ. అయితే ముదురు భామ ఇప్పటికీ చాలా స్లిమ్ గా ఉంది. 50 ప్లస్ ఏజ్ లో కూడా చాలా యంగ్ గా కనిపిస్తోన్న ఈ సీనియర్ హీరోయిన్ స్వీట్లు బాగా తింటుంది.
మరి స్వీట్లు అంత ఎక్కువగా తిని కూడా బాడీని ఇలా స్లిమ్ గా ఎలా మెయింటైన్ చేస్తోందో మరి ? ఏది ఏమైనా భాగ్యశ్రీ గ్రేట్ బ్యూటీ. ఇక తాజాగా ఈ బ్యూటీ హైదరాబాద్ కి వచ్చింది. హైదరాబాద్ ఎందుకు వచ్చింది అంటే.. ప్రభాస్ ‘రాధే శ్యామ్’ షూటింగ్ లో పాల్గొనేందుకు సిటీకి వచ్చింది. నిజానికి గత గురువారమే భానుశ్రీ ఇక్కడికి వచ్చింది.
అయితే ఆమెకు మధురమైన స్వాగతం లభించడంతో ఆనందంతో ఉబ్బితబ్బి పోతుంది. భానుశ్రీకి స్వీట్లు అంటే ఇష్టం కాబట్టి, వెల్లంకి స్వీట్ షాప్ నుంచి తెప్పించిన పూతరేకుల స్వీట్ డబ్బాలను గిఫ్ట్ బాక్స్ లో ప్రత్యేకంగా భానుశ్రీకి పంపించాడు నేషనల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ నుండి ఊహించని ఈ గిఫ్ట్ కి ఫిదా అయిపోయిన ఈ సీనియర్ హీరోయిన్ ఒక్కసారిగా థ్రిల్ అయిపోయింది.
లాక్ డౌన్ తర్వాత షూటింగ్ కి వచ్చిన తనకు ప్రభాస్ ఇలా వెల్కమ్ చెప్పడంతో తెగ మురిసిపోతుంది భాగ్యశ్రీ. ఈ విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా ప్రభాస్ ప్రత్యేక థాంక్స్ చెప్పింది. ఇక ‘రాధేశ్యామ్’ సినిమాలో భానుశ్రీ ప్రభాస్ కి తల్లిగా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఈ నెలతో పూర్తి కానుంది. ప్రభాస్, భానుశ్రీ కోసం ప్రత్యేక ఫుడ్ ను ఆరెంజ్ చేస్తున్నాడట.