Homeజాతీయ వార్తలుCM KCR- BJP: నీ పిట్ట బెదిరింపులు నా దగ్గర సాగయ్‌.. అసెంబ్లీ సాక్షిగా మళ్లీ...

CM KCR- BJP: నీ పిట్ట బెదిరింపులు నా దగ్గర సాగయ్‌.. అసెంబ్లీ సాక్షిగా మళ్లీ రెచ్చిపోయిన కేసీఆర్‌!

CM KCR- BJP: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై, ప్రధాని నరేంద్రమోదీపై కారాలు మిరియాలు నూరుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వేదిక ఏదైనా వారినే టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. కారణం ఏదైనా లక్ష్యం మాత్రం ఐతే కేంద్ర లేకుంటే మోదీ అన్నట్లుగా ఊగిపోతున్నారు కేసీఆర్‌. తాజాగా తెలంగాణ అసెంబ్లీని కూడా ఇందుకు వేదికగా మార్చుకున్నారు. ఇటీవల ప్రారంభమైన తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు మూడు రోజుల విరామం తర్వాత సోమవారం మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇందులో కేంద్రం తీసుకువచ్చే విద్యుత్‌ చట్ట సవరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ మాట్లాడుతూ మోదీ టార్గెట్‌గా విమర్శనాస్త్రాలు సంధించారు. మధ్యమధ్యలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుకూ చురకలు అంటించారు.

CM KCR- BJP
CM KCR- BJP

ప్రగతికి సూచిక అంటూ..
విద్యుత్‌ వినియోగం రాష్ట్రాల ప్రగతికి చూసిక అని కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్రాలు ఎంత విద్యుత్‌ వినియోగిస్తున్నాయనేది ఆ రాష్ట్ర ప్రగతిని తెలియజేస్తుందని ప్రకటించారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో విద్యుత్‌ విషయంలో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడ్డారని.. నాడు అనేక ప్రాంతాల్లో విద్యుదాఘాతాలతో ప్రజలు చనిపోయారని చెప్పారు. బిల్లులు కట్టలేదని విద్యుత్‌ అధికారులు దాడులు చేయబోతే కొందరు విషంతాగి చనిపోయారని గుర్తు చేశారు. దేశాల విద్యుత్‌ వినియోగాన్ని ప్రగతి సూచికలో ముఖ్యమైనదిగా ఆధునిక ప్రపంచం పరిగణిస్తుందని తెలిపారు.

ఆ సీఎం చేతిలో ప్రధాని కీలుబొమ్మ..
ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం హామీల అమలులో మోదీ తెలంగాణకు అన్యాయం చేశారని ఆరోపించారు. విద్యుత్‌ కేటాయింపుల్లో తెలంగాణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు. ఇరు రాష్ట్రాల కేటాయింపుల్లో భాగంగా లోయర్‌ సీలేరు విద్యుత్‌ ప్రాజెక్టును తెలంగాణకు అప్పగించారని తెలిపారు. సింగరేణి కాలరీస్‌పై హక్కు తెలంగాణకే ఉంటుందని తెలిపారన్నారు. అయితే 2014లో అప్పటి ఏపీ సీఎం చేతిలో ప్రధాని కీలుబొమ్మగా మారారని ఆరోపించారు. అప్రజాస్వామికంగా ఏడు మండలాలపై ఆర్డినె¯Œ ్స తెచ్చారని విమర్శించారు. తెలంగాణ శాసనసభకు ప్రతిపాదించకుండానే కర్కశంగా ఏపీకి అప్పగించారి పేర్కొన్నారు. సీలేరు విద్యుత్‌ ప్రాజెక్టునూ వారికే కేటాయించారని వెల్లడించారు.

అమ్ముకుంటూ పోతున్నరు..
మన దేశంలో రైళ్లు, ఎల్‌ఐసీసహా అన్ని రంగాలనూ కేంద్రం అమ్మేస్తోందని కేసీఆర్‌ తెలిపారు. ఇంకా అమ్మేందుకు వ్యవసాయ, విద్యుత్‌ రంగాలే మిగిలాయని ఎద్దేవా చేశారు. సంస్కరణల పేరుతూ వాటినీ ప్రైవేటుపరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రైతుల భూములను కబళించేందుకు మోదీ వ్యూహరచన చేస్తున్నారని అన్నారు. కేంద్రం మాటలు నమ్మితే సొంత పొలంలోనే రైతులు కూలీలుగా మారతారని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం కొనాలని కోరితే కేంద్ర మంత్రులు ఎగతాళి చేస్తున్నారని, వైద్యకళాశాల, నవోదయ విద్యాలయం ఇవ్వాలని అడిగితే ఒక్కటీ ఇవ్వలేదని వివరించారు. వ్యవసాయ రంగంపై కేంద్రానికి స్పష్టమైన ప్రణాళిక లేదని విమర్శించారు. నూకలు కూడా ఎగుమతి చేయకుండా నిషేధం విధించారన్నారు. కేంద్రం అసమర్థ విధానాలు, దూరదృష్టి లేకపోవడంతోనే వ్యవసాయరంగం సంక్షోభంలో ఉందని పేర్కొన్నారు.

మేకిన్‌ ఇండియా అబద్ధపు ప్రచారం..
ప్రధాని నరేంద్రమోదీ చెబుతున్న మేకిన్‌ ఇండియా పూర్తిగా అబద్ధపు ప్రచారంగా కేసీఆర్‌ అభివర్ణించారు. మాంజా, జెండాలు, టపాసులు అన్నీ చైనా నుంచే వస్తున్నాయని తెలిపారు. గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు కూడా పొందని బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. అధికార మదం నెత్తికెక్కి కేంద్ర మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతురని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు 11 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూలగొట్టిందని తెలిపారు. రాజ్యాంగ సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. తెలంగాణలో 3 తోకలున్నాయి.. అయినా మమ్మల్ని పడగొడతామని అంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని, కేంద్రమంత్రుల అవివేక చర్యలతో దేశం ప్రమాదంలో పడిందని తెలిపారు.

అబద్ధమని నిరూపిస్తే రాజీనామా చేస్తా..
జాతీయ తలసరి విద్యుత్‌ వినియోగం 957 యూనిట్లయితే తెలంగాణ తలసరి విద్యుత్‌ వినియోగం 1,250 యూనిట్లు అని కేసీఆర్‌ తెలిపారు. చిన్నదేశాల కంటే మనదేశంలోనే విద్యుత్‌ వినియోగం తక్కువ అని పేర్కొన్నారు. విద్యుదుత్పత్తి గురించి కేంద్ర ప్రభుత్వం చెప్పేవన్నీ గోల్‌మాల్‌ గోవిందం మాటలే అన్నారు. సౌరశక్తి పేరుతో విద్యుత్‌ వ్యవస్థను బడాబాబులకు అప్పగించేదుకు కేంద్రం స్కెచ్‌ వేసిందన్నారు. తాను చెప్పిన విద్యుత్‌ లెక్కలు అబద్ధమని తేలితే రాజీనామా చేస్తానని అసెంబ్లీ వేదికగానే కేంద్రాన్ని, బీజేపీని సవాల్‌ చేశారు. యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ పూర్తయితే మనకూ విద్యుత్‌ చౌకగా లభిస్తుందని తెలిపారు.

ఆ బకాయిలు ఇప్పించండి..
ఏపీకి రూ.3 వేల కోట్ల విద్యుత్‌ బకాయిలు.. మరో రూ.3 వేల కోట్ల వడ్డీ కట్టాలని తెలంగాణను కేంద్రం ఆదేశించడంపై కేసీఆర్‌ మండిపడ్డారు. నెలలో కట్టకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ నుంచి తెలంగాణకు రూ.17 వేల కోట్లు రావాలని, కృష్ణపట్నం సహా అనేక రంగాల్లో తెలంగాణ వాటా ఉందని తెలిపారు. మీరు చెబుతున్న రూ.6 వేల కోట్లు మినహాయించుకుని మిగతా మొత్తాన్ని కేంద్రం తెలంగాణకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రఘునందన్‌రావు తెలంగాణ ఎమ్మెల్యే అయితే అవి ఇప్పించాలని డిమాండ్‌ చేశారు.

CM KCR- BJP
CM KCR- BJP

రైతుల బాధలు తీరుతున్నయ్‌..
గతంలో 20 ఎకరాలున్న రైతు కూడా ఒకప్పుడు నగరాలకు వచ్చి కూలీ పనులు చేసుకునే పరిస్థితి ఉండేదని కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రైతుల బాధలు ఇప్పుడే తీరుతున్నాయన్నారు. రాష్ట్రంలో 66 లక్షల మందికి ఇచ్చే రైతుబంధు రైతులకు నిజమైన ఉద్దీపన కార్యక్రమంగా చెప్పుకున్నారు. రాష్ట్రంలో ఈ వానాకాలంలో 65 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోందని తెలిపారు. కోటి ముప్పై లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగువుతున్నాయని పేర్కొన్నారు. ఇది చూసి కుళ్లుకుంటున్న కేంద్రం కళ్లు మండుతున్నాయని ఆరోపించారు.

ఆ బిల్లులు వాపస్‌ తీసుకోండి..
ఏం చేసైనా సరే తెలంగాణలో ఉచిత విద్యుత్‌ బంద్‌ చేయాలని కేద్రం చూస్తోందని కేసీఆర్‌ ఆరోపించారు. కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఇప్పుడు తెలంగాణపై పడ్డారన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆర్‌ఈసీ రుణాలు ఆపేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. ఉదయ్‌ పథకంలో చేరాక అనేక ఇబ్బందులు పెడుతున్నారన్నారు. తెలంగాణ పోరాటాలు, పౌరుషాల గడ్డ అని, మోదీ పిట్ట బెదిరింపులకు భయపడమని అన్నారు. విద్యుత్‌ విషయంలో కేంద్రం బండారం బయటపెడతానని హెచ్చరించారు. విద్యుత్‌ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.

విదేశీబొగ్గు కొనాలని ఒత్తిడి..
తెలంగాణలో నల్లబంగారం ఉత్పత్తి చేస్తున్న సింగరేణి ఉన్నప్పటికీ విదేశీ బొగ్గు 10 శాతం విధిగా కొనాలని విశ్వగురుగా బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్న మోదీ ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. రూ.4 వేలకు వచ్చే సింగరేణి బొగ్గు వదిలి రూ.30 వేలకు వచ్చే బొగ్గు కొనాలా అని ప్రశ్నించారు. కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్‌ విధానంతో దేశం అంధాకారంలోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్రాన్ని కూడా అంధకారంలోని నెట్టాలని మోదీ సర్కార చూస్తోందని దుయ్యబట్టారు.

శీతాకాల సమావేశాలు 20 రోజులు..
తెలంగాణలో ఇచ్చే పింఛన్లు, రైతుబంధు గురించి కేంద్రమంత్రికి ఎందుకని కేసీఆర్‌ ప్రశ్నించారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాలు 20 రోజులు నిర్వహిస్తామని ప్రకటించారు. ఆ సమావేశాల్లో కేంద్రం తీరును ఎడగడతామని తెలిపారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version