CM KCR: తెలంగాణ వస్తే చీకిటి రాజ్యం అవుతుంది.. కరెంట్ కూడా ఉండదు.. అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పడు కొందరు నాయకులు కామెంట్ చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడుతున్న వారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ ఆ కామెంట్ చేసిన వారికి ధీటుగా ఇప్పుడు తెలంగాణ వెలుగుల్లో విరజిమ్ముతోందని.. ఆంధ్రప్రదేశ్ చీకట్లో కూరుకుపోయిందని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక తెలంగాణలో రాష్ట్రం అభివృద్ది చెందిందనేదానికి ఇదే నిదర్శనమని కేసీఆర్ ఇలా చెప్పారు. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఎన్నికలు ఉద్దేశించినవేనని అంటున్నారు.. తెలంగాణలో త్వరలో ఎన్నికలు ఉన్నందున మరోసారి సెంటిమెంట్ అస్త్రాన్ని సంధించారన్న చర్చ సాగుతోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత కేసీఆర్ రెండు సార్లు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు ప్లాన్ వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలకు చెందిన నాయకులు బీఆర్ఎస్ పై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ భూములు విక్రయిస్తూ.. కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిన కేసీఆర్ ను మరోసారి అధికారంలోకి రానిచ్చేది లేదని అంటున్నారు. ఈ తరుణంలో అవసరమైతే ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి తెస్తామని అంటున్నారు. అయితే కేసీఆర్ ను గద్దె దించేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని, టీడీపీ అధినేత చంద్రబాబు అంటున్నారు.
ఇటీవల ఆయన తెలంగాణలో జోరుగా పర్యటిస్తున్నారు. మంగళవారం చంద్రబాబు కార్యకర్తల జోష్ మధ్య ఎన్టీఆర్ భవన్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో టీడీపీ మరోసారి పుంజుకుంటుందని అన్నారు. అనంతరం పార్టీ నాయకులతో తెలంగాణలో జరిగే పరిస్థితులపై తీవ్రంగా చర్చించారు. అవసరతమైతే లోకల్ పార్టీలతో పొత్తు పెట్టుకొని కేసీఆర్ ను గద్దె దించాలన్నట్లు చంద్రబాబు కార్యకర్తలకు చెప్పినట్లు సమాచారం.
2018 ఎన్నికల సమయంలోనూ చంద్రబాబు ఇదే హడావుడి చేశారు. ఇక్కడ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి దిగారు. ఒక దశలో అప్పటి టీఆర్ఎస్ ఓడిపోతుందని కొన్ని సర్వే సంస్థలు కూడా ప్రకటించారు. కానీ అనూహ్యంగా టీఆర్ఎస్ కు సీట్లు పెరిగాయి. అప్పుడలా కేసీఆర్ ను రెండోసారి అధికారంలోకి తెచ్చింది సెంటిమెంట్ అస్త్రమేనని తెలుస్తోంది. ఆ సమయంలో కేసీఆర్ గోదావరి నీళ్ల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న మనస్పర్థలకు బయటకు తీశారు. దీంతో మరోసారి ఆంధ్రా పాలకులు తెలంగాణపై పడుతున్నారన్నట్లు వ్యాఖ్యలు చేయడంతో పరిస్థితులు మారాయన్న చర్చ సాగింది.
ఇప్పుడు కేసీఆర్ విద్యుత్ రంగం విషయంలో తెలంగాణ, ఆంధ్రల మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తున్నారు. గతంలో కొందరు పాలకులు తెలంగాణ వస్తే చీకటి రాజ్యం అవుతుందని విమర్శించారు. కానీ ప్రత్యేక తెలంగాణ సాధించి తొమ్మిదేల్లకు తెలంగాణలో వెలుగులు విరజిమ్ముతున్నాయని అన్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం విద్యుత్ రంగం అప్పుల్లో కూరుకుపోయిందని, ఆ భారం అంతా ప్రజలపై ఏసీడీ చార్జీల పేరిట వసూలు చేస్తున్నారని, ఈ అప్పుల సంగతి చెప్పరా కేసీఆర్.. అని అంటున్నారు.