https://oktelugu.com/

Chiranjeevi: లక్కీఛాన్స్ కొట్టేసిన జబర్దస్ట్ బ్యూటీ.. చిరు సినిమాలో రష్మి?

Chiranjeevi: జబర్దస్త్ షోలో ఆకట్టుకునే అందంతో రష్మీ అందరిని ఆకట్టుకుంటోంది. జబర్దస్త్ షోకు కొత్త సొబగులు తెస్తోంది. తన అందం చూసేందుకు ప్రేక్షకులు మొగ్గు చూపుతుంటారు. అంతే స్థాయిలో షోను కూడా ముందుకు తీసుకువెళుతోంది. ప్రేక్షకుల మదిని దోచుకుంటోంది. పసి పిల్లాడి నుంచి పండు ముసలి వరకు అందరు రష్మీ గౌతమ్ అందాన్ని ఆస్వాదిస్తున్నారు. Also Read: ముగ్గురు అక్కాచెల్లెల్లయిన హీరోయిన్లతో నటించిన ఒకే ఒక్క హీరో మన మెగాస్టార్ అంతటి అందంతో కుర్రకారును రెచ్చగొట్టే రష్మీ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 24, 2021 / 11:17 AM IST
    Follow us on

    Chiranjeevi: జబర్దస్త్ షోలో ఆకట్టుకునే అందంతో రష్మీ అందరిని ఆకట్టుకుంటోంది. జబర్దస్త్ షోకు కొత్త సొబగులు తెస్తోంది. తన అందం చూసేందుకు ప్రేక్షకులు మొగ్గు చూపుతుంటారు. అంతే స్థాయిలో షోను కూడా ముందుకు తీసుకువెళుతోంది. ప్రేక్షకుల మదిని దోచుకుంటోంది. పసి పిల్లాడి నుంచి పండు ముసలి వరకు అందరు రష్మీ గౌతమ్ అందాన్ని ఆస్వాదిస్తున్నారు.

    Chiranjeevi with Rashmi

    Also Read: ముగ్గురు అక్కాచెల్లెల్లయిన హీరోయిన్లతో నటించిన ఒకే ఒక్క హీరో మన మెగాస్టార్

    అంతటి అందంతో కుర్రకారును రెచ్చగొట్టే రష్మీ ఎప్పుడు సామాజిక మాధ్యమాల్లో తన పోస్టులు పెడుతూంటుంది.  ఇప్పటికే పలు సినిమాల్లో నచించి ప్రశంసలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ జబర్దస్త్ అందగత్తె మరో లక్కీ ఛాన్స్ కొట్టినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ తెరకెక్కిస్తోన్న భోళా శంకర్​లో అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. ఇందులో రష్మి ఓ సాంగ్​లో మెరవనున్నట్లు ఇండస్ట్రీలో టాక్​. ఇటీవలే షూటింగ్ ప్రారంభం కాగా.. ప్రస్తుతం పలు యాక్షన్​ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

    తమిళ సినిమా వేదాళం రీమేక్​గా తెరకెక్కుతోంది. అందులో అజిత్​  పాత్రలో చిరు కనిపించనున్నారు. ఇందులో చిరు చెల్లెలుగా కీర్తి సురేశ్​ కనిపించనుంది. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనీల్ సుంకర ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఆచార్య సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు చిరు. ఇటీవలే షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదలకు సిద్ధమైంది. ఇందులో రామ్​చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాజల్​, పూజా హెగ్డె హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

    Also Read: కైకాల ఆరోగ్య పరిస్థితిపై చిరు ఆసక్తికర ట్వీట్​