https://oktelugu.com/

CM KCR- National Party: ‘పీఎం’ ఎప్పుడవుతవ్ కేసీఆర్ సారూ!

CM KCR- National Party: ‘‘‘మోతువారీ.. డైలాగులు చెప్పమంటే బొచ్చెడు చెబుతడు…. *దేశ్ కీ నేత..’ ‘సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే..’ అంటూ గులాబీ శ్రేణులు తొడగొడుతుంటారు.. దసరాకు జాతీయ రాజకీయాల్లో దున్నేసుడే అంటివి కదనే.. గిప్పుడేమైంది.. దసరా రావట్టే.. బతుకమ్మ పోవట్టే.. ఇంకా సప్పుడే లేకపోయే…! గిట్ల కుచించుకుపోతే.. నీ పాసుగాల ‘పీఎం’ ఎప్పుడవుతవ్ కేసీఆర్ సారూ.. నువ్వు దుంకాలే.. జాతీయ రాజకీయాలను దున్నేయాలే.. కానీ ఆ పాడు ‘ఈడీ’ దెబ్బకు మొత్తం ధిమాక్ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 27, 2022 / 12:07 PM IST
    Follow us on

    CM KCR- National Party: ‘‘‘మోతువారీ.. డైలాగులు చెప్పమంటే బొచ్చెడు చెబుతడు…. *దేశ్ కీ నేత..’ ‘సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే..’ అంటూ గులాబీ శ్రేణులు తొడగొడుతుంటారు.. దసరాకు జాతీయ రాజకీయాల్లో దున్నేసుడే అంటివి కదనే.. గిప్పుడేమైంది.. దసరా రావట్టే.. బతుకమ్మ పోవట్టే.. ఇంకా సప్పుడే లేకపోయే…! గిట్ల కుచించుకుపోతే.. నీ పాసుగాల ‘పీఎం’ ఎప్పుడవుతవ్ కేసీఆర్ సారూ.. నువ్వు దుంకాలే.. జాతీయ రాజకీయాలను దున్నేయాలే.. కానీ ఆ పాడు ‘ఈడీ’ దెబ్బకు మొత్తం ధిమాక్ అంతా ఖరాబ్ అయిపోయే.. కేసీఆర్ ‘జాతీయ’ అడుగులు వెనక్కివడవట్టే.. ’’’

    CM KCR

    తెలంగాణ సీఎం కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయి.. ఆయన గడపదాటరు అన్నది తెలంగాణ రాజకీయాల్లో ఓ సెటైరికల్ సామెత. అది ఎప్పుడూ రుజువు అవుతున్నా కానీ.. జనాలే ఎందుకో పట్టించుకోరు.. అలా కేసీఆర్ మ్యాజిక్ చేస్తుంటారు.. జనాల్లో చెవుల్లో ‘పిచ్చిపూలు’ పెడుతుంటాడు. అరచేతిలో వైకుంఠం చూపించి.. సంక్షేమ పథకాల మాటలు మాట్లాడగానే అందరూ కేసీఆర్ లాలిపాటలకు బజ్జుంటారు. అంతేకానీ జనాలేమీ తెలివి తక్కువ వారు కాదు.. టైం వచ్చినప్పుడు కేసీఆర్ కు కర్రుకాల్చి వాతపెడుతారు.. ఐదేళ్లు ఛాన్స్ ఇచ్చిండ్లు కాబట్టి ఇప్పుడు భరిస్తున్నారు. కేసీఆర్ రాజకీయాన్ని తరిచి చూడడంలో ఇప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం వెనుకబడుతుంటాయి. ఆయన రాజకీయంలో పడి కొట్టుకుపోతుంటాయి.. అదే వేరే విషయం..

    Also Read: Junior NTR- JanaSena: జనసేన పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్… ఫ్యాన్స్ కు పండుగే..

    తెలంగాణలోనే పాలన సక్కగ చేయని ఈ పెద్ద మనిషి దేశాన్ని దున్నేయడానికి దుముకుతాడని అంతా భావించారు. మోడీ మెడలు వంచి కూసుండబెడుతాడు అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఏమైంది.. ‘ఈడీ’ వచ్చి కేసీఆర్ ఫ్యామిలీ మెడకు చుట్టుకునే.. కేసీఆర్ కూతురు కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తుండే. అందుకే అనువుగానీ చోట అధికులం అనరాదు అని కేసీఆర్ తన చేయిసంచి పక్కనపడేసి జాతీయ రాజకీయాల ముచ్చటే ఇప్పుడు తీయడం లేదు.

    CM KCR

    కేసీఆర్ జాతీయ అడుగులు వెనక్కిపడడానికి ప్రధానంగా పరిస్థితులు అనుకూలించకపోవడమే ప్రధాన కారణం.. కేసీఆర్ దోస్తులంతా కాంగ్రెస్ పక్షాన చేరడమో.. మోడీకి గులాంగిరీ చేయడమో చేస్తున్నారు. కేసీఆర్ కే ‘హ్యాండ్’ ఇస్తున్నారు. మొన్నటికి మొన్న బీహార్ వెళ్లి నితీష్ ను కలిసి హల్ చల్ చేసిండు కేసీఆర్ . కానీ ఇప్పుడాయన సోనియా, రాహుల్ ను కలుస్తానని.. మోడీని ఓడిస్తానంటూ కాంగ్రెస్ తో కలిసిపోయారు. ఇక పెద్దక్క ‘మమతా బెనర్జీ’ అయితే మొన్నటిదాకా మోడీ అంటేనే ఒంటికాలిపై లేచేది. ఇటీవల ‘ఈడీ, సీబీఐలను మోడీ ఉసిగొల్పుత లేడు. మోడీ చాలా మంచోడు’ అని సర్టిఫికెట్ ఇచ్చి బెంగాల్ పులి కాస్తా పిల్లి అయిపోయింది.

    ఇక ఉన్న ఒక్క కేజ్రీవాల్ జాతీయ రాజకీయాల కంటే తన పార్టీని గుజరాత్ లో ఎలా విస్తరించాలి.? బీజేపీని ఎలా ఓడించాలని ప్లాన్లు చేస్తున్నాడు. దేశ్ కి నేత అయిపోదామని కేజ్రీవాల్ కు లేకున్నా.. చాపకింద నీరులా విస్తరణ మాత్రం చేస్తున్నాడు. ఇక దక్షిణాన కుమారస్వామి తింటే పంటాడు.. పంటే లేవడు.. ఈయనతో కేసీఆర్ కు రూపాయి లాభం లేదు. స్టాలిన్ ఫక్తు కాంగ్రెస్ వాది.. రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్నాడు.

    సో కేసీఆర్ దేశంలో బయలు దేరితే వచ్చే ఒక్కటంటే ఒక్క నేత కూడా కరువైండు. బీజేపీ అలా డిసైడ్ చేసింది.. మిగతా వాళ్లంతా కేసీఆర్ ను నమ్మక ఎవరిదారి వారు చూసుకున్నారు. ఇక ఈడీ కేసు ఉండనే ఉంది. అది కేసీఆర్ ఫ్యామిలీని, కవిత మెడకు చుట్టుకోవడానికి రెడీ అయ్యింది. అందుకే ఈ దసరా నుంచి జాతీయ రాజకీయాలను దున్నేస్తానని నాగలిపట్టిన కేసీఆర్ ఇప్పుడా కాడి వదిలేసి ఫాంహౌస్ లో కొద్దిరోజులు ప్రశాంతంగా పంటనే నయం అన్నట్టుగా ఉన్నాడు. కాలం కలిసిరానప్పుడు తాడు కూడా పాము అయితే కర్తది. ఆ విషయం తెలుసు కనుకనే కేసీఆర్ ఇప్పుడు గమ్మున ఉన్నడనట్టు.. !

    Also Read: Ponniyin Selvan: ‘పొన్నియన్ సెల్వన్’: అసలు కథేంటి? ఎవరు ఏ పాత్రలు పోషించారంటే?

     

    Tags