ఎల్లుండి సంతోష్ బాబు ఇంటికి వెళ్లనున్న కేసీఆర్

భారత్-చైనా సరిహద్దు ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు మృతిచెందాడు. సూర్యాపేట జిల్లాకు చెందిన కల్నల్ సంతోష్ బాబు కొన్నేళ్లుగా ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నాడు. గడిచిన ఏడాదిన్నర చైనా సరిహద్దుల్లో కల్నల్ స్థాయిలో సంతోష్ బాబు విధులు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో గడిచిన సోమవారం భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు సహా 19మంది జవాన్లు వీరమరణం పొందారు. సంతోష్ బాబు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. కేసీఆర్ కరుణిస్తాడా? కాలదన్నుతాడా? కల్నల్ సంతోష్ […]

Written By: Neelambaram, Updated On : June 20, 2020 7:24 pm
Follow us on


భారత్-చైనా సరిహద్దు ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు మృతిచెందాడు. సూర్యాపేట జిల్లాకు చెందిన కల్నల్ సంతోష్ బాబు కొన్నేళ్లుగా ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నాడు. గడిచిన ఏడాదిన్నర చైనా సరిహద్దుల్లో కల్నల్ స్థాయిలో సంతోష్ బాబు విధులు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో గడిచిన సోమవారం భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు సహా 19మంది జవాన్లు వీరమరణం పొందారు. సంతోష్ బాబు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.

కేసీఆర్ కరుణిస్తాడా? కాలదన్నుతాడా?

కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియల్లో గవర్నర్ తమిళిసై, మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి, ప్రతిపక్ష నాయకులు రేవంత్ రెడ్డి, కోమటరెడ్డి వెంకట్ రెడ్డి తదితర నేతలు పాల్గొని వీరజవానుకు నివాళ్లర్పించారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందులో పాల్గొనకపోవడంపై ప్రతిపక్షాలు విమర్శలకు గుప్పించారు. దీంతో ఈ విమర్శలకు చెక్ పెడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోష్ బాబు కుటుంబానికి భారీ సాయం ప్రకటించారు.

కనుమరుగు కథ.. కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పు అదే!

సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 కోట్ల పరిహారం, ఆయన భార్యకు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇస్తామని.. ఇంటి స్థలం అందజేస్తామని సీఎం కేసీఆర్ శుక్రవారం రాత్రి ప్రకటించారు. అదేవిధంగా గాల్వన్లో అమరులైన మిగతా జవాన్లకు రూ.10 లక్షల చొప్పున పరిహారాన్ని తెలంగాణ ప్రభుత్వం అందజేయనుందనని ప్రకటించారు. ఈమేరకు సోమవారం సీఎం కేసీఆర్ ఆయన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించి సాయం అందించనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే శుక్రవారం సాయంత్రం ప్రధాని మోదీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రధానికి పలు సూచనలు చేశారు. చైనా విషయంలో భారత్ రాజనీతితో కాకుండా రణనీతిని ప్రదర్శించాలని ప్రధాని మోదీకి సూచించారు. కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరిని చైనా జీర్ణించుకోలేక ఘర్షణలకు దిగుతోందని ఆయన ఆరోపించారు. భారత జవాన్లను దొంగదెబ్బ తీసిన చైనాకు తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందన్నారు.