CM KCR- Munugode By Election 2022: మునుగోడు ఉప ఎన్నికపై మూడు పార్టీలు దృష్టి సారించాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావడంతో గులాబీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల కోసం వేట ప్రారంభించాయి. ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందని ఆలోచనలో పడ్డాయి. మునుగోడులో ఎలాగైనా విజయం సాధించాలని అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. పోయిన పరువు నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ భావిస్తుండగా ఇక్కడ ఎలాగైనా విజయం సాధించి ఇతరులకు గట్టి సవాలు విసరాలని బీజేపీ భావిస్తోంది. తమ అభ్యర్థి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని తామే దక్కించుకోవాలని కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. టీఆర్ఎస్ సైతం తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది.

టీఆర్ఎస్ అభ్యర్థి విషయంలో అధినేతదే తుది నిర్ణయం అని ప్రకటించడంతో గులాబీ బాస్ అభ్యర్థి వేటలో మునిగిపోయారు. అన్ని విధాలా సరైన అభ్యర్థిని ఎంపిక చేయాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే సర్వేలు చేయిస్తున్నారు. ఎవరైతే కచ్చితంగా విజయం సాధిస్తారో వారినే సెలెక్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు. చాలా మంది టికెట్ ఆశిస్తున్నారు. అధికార పార్టీ కావడంతో సహజంగానే కొంత ఆశాజనకంగా ఉంటుందని తెలిసిందే. ఈ నేపథ్యంలో అభ్యర్థి ఎంపిక పార్టీకి కాస్త శిరోభారంగానే మారినట్లు తెలుస్తోంది.
Also Read: China- Abdul Raoof: ఆ ఉగ్రవాదిపై చైనాకు ఎందుకు అంత ప్రేమ
నల్గొండ శాసనసభ్యుడు భూపాల్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి మునుగోడు టికెట్ ఆశిస్తున్నారు. భూపాల్ రెడ్డి సోదరులు సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. మునుగోడు తాజా పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. మరోవైపు వేనేపల్లి వెంకటేశ్వర్ రావు కూడా మునుగోడు టికెట్ కావాలని అడుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి వచ్చిన వెంకటేశ్వర్ రావు 2018లో టికెట్ రాకపోవడంతో భంగపడి సస్పెన్షన్ కు గురయ్యారు. ప్రస్తుతం ఆయనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసినట్లు సీఎం తెలిపారు. దీంతో టికెట్ ఎవరికి కేటాయిస్తారో తెలియడం లేదు.

పార్టీలో మాత్రం చాలా మంది ఆశావహులే ఉన్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికపై టీఆర్ఎస్ మాత్రం ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. కానీ కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్ రావు కాకుండా ఇంకా కొంత మంది ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఉపఎన్నిక వ్యవహారంలో టికెట్ కేటాయింపు ఓ కొలిక్కి రావడం లేదు. అభ్యర్థుల్లో మాత్రం కంగారు పుడుతోంది. టికెట్ ఎవరికి దక్కుతుందోననే బెంగ అందరిలో పట్టుకుంది. ఏదిఏమైనా మునుగోడు విషయంలో అధినేత కేసీఆర్ మదిలో ఏముందో ఎవరికి తెలియడం లేదు.
టికెట్ కేటాయింపులో కేసీఆర్ ఏ ప్రాతిపదిక పాటిస్తారో కూడా అంతుచిక్కడం లేదు. ఇద్దరి మధ్యలో టికెట్ పోటీ ఏర్పడిందని తెలుస్తోంది. కృష్ణారెడ్డి ఇదివరకే కేసీఆర్ తో సమావేశమై తాను గెలుస్తానని దీమా వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక వెంకటేశ్వర్ రావుపై సస్పెన్షన్ వేటు ఎత్తివేడయంతో ఆయనకే కేటాయిస్తారో ఏమో అనే సందేహాలు వస్తున్నాయి. మొత్తానికి అధినేత మదిలో ఎవరు ఉన్నారో కూడా గోప్యంగానే ఉంచుతున్నారు. చివరికి టికెట్ ఎవరిని వరిస్తుందో ఎవరు గెలుస్తారో వేచి చూడాల్సిందే మరి.
Also Read:Rakesh Jhunjhunwala Passes Away: ఇండియన్ వారెన్ బఫెట్ ఇకలేరు
[…] Also Read: CM KCR- Munugode By Election 2022: మునుగోడు అభ్యర్థిపై తేల… […]
[…] Also Read: CM KCR- Munugode By Election 2022: మునుగోడు అభ్యర్థిపై తేల… […]
[…] Also Read: CM KCR- Munugode By Election 2022: మునుగోడు అభ్యర్థిపై తేల… […]
[…] Also Read: CM KCR- Munugode By Election 2022: మునుగోడు అభ్యర్థిపై తేల… […]