అడుక్కోవడం తప్ప చేసేందేం లేదు.. జగన్ నిర్వేదం

ఏపీ సీఎం జగన్ నిర్వేదం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాపై స్పందించిన జగన్.. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ కేంద్రంలో బలంగా ఉందని.. హోదాను అడుక్కోవడం తప్ప చేసేందేం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉంటేనే మనం హోదా సాధించగలమని జగన్ కుండబద్దలు కొట్టారు. ఏపీలో ఉద్యోగ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా జగన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి. ప్రత్యేక హోదాపై కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నామని జగన్ అన్నారు. ప్యాకేజీ , […]

Written By: NARESH, Updated On : June 19, 2023 3:44 pm
Follow us on

ఏపీ సీఎం జగన్ నిర్వేదం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాపై స్పందించిన జగన్.. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ కేంద్రంలో బలంగా ఉందని.. హోదాను అడుక్కోవడం తప్ప చేసేందేం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉంటేనే మనం హోదా సాధించగలమని జగన్ కుండబద్దలు కొట్టారు.

ఏపీలో ఉద్యోగ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా జగన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి. ప్రత్యేక హోదాపై కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నామని జగన్ అన్నారు. ప్యాకేజీ , ఓటుకు నోటు కేసు కోసం చంద్రబాబు హోదాను బీజేపీ వద్ద తాకట్టు పెట్టారని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ వెళ్లినప్పుడల్లా హోదా కోసం కేంద్రాన్ని అడుగుతున్నామని జగన్ అన్నారు.

ఢిల్లీలో సంకీర్ణ ప్రభుత్వాలు ఉంటే ఇప్పటికే ప్రత్యేక హోదా వచ్చేదని.. కానీ పార్లమెంట్ లో బీజేపీకి పూర్తి స్థాయి ఎంపీల బలం ఉండడంతో ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయని జగన్ నిర్వేదం వ్యక్తం చేశారు. దేవుడి దయ వల్ల భవిష్యత్తులోనైనా ఈ పరిస్థితులు మారాలని కోరుకుంటున్నట్టు జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా బీజేపీ బలం వచ్చే ఎన్నికల్లో పడిపోవాలనేలా జగన్ తీరు సాగింది.

చంద్రబాబు గత ప్రభుత్వంలో మోడీతో కేసుల విషయమై రాజీపడి తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. అప్పటి కేంద్రప్రభుత్వంలో ఇదే గత ప్రభుత్వ పెద్దలందరూ రెండు మంత్రి పదవులు కూడా అనుభవించారని జగన్ ఆరోపించారు. హోదా కోసం అవకాశం ఉన్న రోజుల్లో వాళ్లు రాజీపడడం వల్ల ఇప్పుడు మనం ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి కేంద్ర ప్రభుత్వానికి హోదా ఇవ్వాలని వేడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.