https://oktelugu.com/

ముగిసిన జగన్ టూర్.. కీలక భేటీలివే..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. రెండురోజుల పాటు వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం శుక్రవారం ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్, షెకావత్, ప్రకాశ్ జవదేకర్, ధర్మేంద్ర ప్రధాన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ లను కలిసి కీలక విషయాలపై చర్చించారు. రాష్ర్టాభివృద్ధికి తమవంతు సహకరిస్తామని కేంద్ర మంత్రులు జగన్ కు హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, […]

Written By: , Updated On : June 11, 2021 / 05:03 PM IST
Follow us on

CM jaganఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. రెండురోజుల పాటు వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం శుక్రవారం ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్, షెకావత్, ప్రకాశ్ జవదేకర్, ధర్మేంద్ర ప్రధాన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ లను కలిసి కీలక విషయాలపై చర్చించారు. రాష్ర్టాభివృద్ధికి తమవంతు సహకరిస్తామని కేంద్ర మంత్రులు జగన్ కు హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, సీఎస్ ఆదిత్యనాథ్ ఉన్నారు.

రెండు రోజుల పర్యటన కోసం గురువారం ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్ మధ్యాహ్నం నుంచి వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి గంటన్నరపాటు సమావేశమయ్యారు. తొలిరోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రులు అమిత్ షా, గజేంద్ర షెకావత్ ప్రకాశ్ జవదేకర్ తదితరులతో సమావేశమయ్యారు. మూడు రాజధానులతోపాటు పోలవరం నిధులు, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుతో పాటు రాష్ర్ట అభివృద్ధి అంశాలపై చర్చించారు.

కేంద్ర ఉక్కు పెట్రోలియం శాఖ మంత్రి ప్రధాన్ తో జగన్ భేటీ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, కాకినాడ పెట్రో కాంప్లెక్స్, పెట్రో వర్సిటీ ఏర్పాటు తదితర అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయాలని, ఆ విషయంలో తాము సూచించిన ప్రత్యామ్నాయాలను సీఎం మరోసారి కేంద్రమంత్రికి వివరించారు. కాకినాడ ఎస్ఈజడ్ లో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చర్యలను వేగవంతం చేయాలని కోరారు. వయాబిలిటి గ్యాప్ ఫండ్ విషయంలో రాష్ర్టంపై పెద్దగా భారం లేకుండా చూడాలని జగన్ కోరారు.

కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తోనూ శుక్రవారం సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ర్ట సివిల్ సప్లయ్ కి రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని కోరారు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు రూ.3,229 కోట్ల బకాయిలు విడుదల చేయాలని విన్నవించారు.2020-21 రబీ సీజన్ కు ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్పిన సీఎం జగన్ సకాలంలో రైతులకు చెల్లింపులు అందేా చర్యలు తీసుకుంటామన్నారు. ఏపీకి రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని కోరారు.