CM Jagan Surprise: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గ కూర్పుపై ప్రత్యేక దృష్టి సారించారు. జాబితా రూపకల్పనపై కసరత్తు చేశారు. కొత్త, పాత కలయికతో మంత్రివర్గాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీంతో కొందరికి ఆగ్రహం వచ్చినా పార్టీ కోసం పనిచేసే వారికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మంత్రివర్గాన్ని తీసుకున్నట్లు సమాచారం. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సమర్ఠులైన వారినే తీసుకున్నట్లు చెబుతున్నారు.

దీంతో ఆశావహుల్లో ఆగ్రహం పెరుగుతోంది. కొందరు కంటనీరు పెట్టుకుంటున్నారు. ఇన్నాళ్లు పార్టీ కోసం పనిచేసినా గుర్తింపు లేదని బాధపడుతున్నారు. నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు మాత్రం సముచిత స్థానం కల్పించారు బీసీ మహిళ అయిన రజనీకి పరిశ్రమల శాఖ కేటాయించడంతో ఆమె సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జీవితాంతం జగన్ వెంట ఉంటానని చెబుతున్నారు.
Also Read: ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రుల జాబితా ఇదే
ఇక నగరి ఎమ్మెల్యే రోజా కు కూడా ఈసారి సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. ఇన్నాళ్లు మంత్రి పదవి లేదని బెంగ పెట్టుకున్న ఆమెకు ఏకంగా హోం మంత్రి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మేకపాటి సుచరిత స్థానంలో రోజాకు మంత్రిపదవి దక్కనుంది. దీంతో ఆమె చిరకాల వాంఛ తీరనుంది. కొద్ది రోజులుగా మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న రోజాకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు బెబుతున్నాయి.
వీరితోపాటు తానేటి వనిత కూడా ఉన్నారు. ఆమెకు మంత్రిపదవి ఖాయమనే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ మంత్రివర్గ కూర్పులో తనదైన ముద్ర వేశారని సమారాం. రాబోయే ఎన్నికలను దృష్టి లో పెట్టుకుని సమర్థులైన వారికి పెద్దపీట వేసినట్లు వార్తలు వస్తున్నాయి. మంత్రివర్గంలో రోజాకు చివరిక్షణంలో చోటు దక్కినట్లు తెలుస్తోంది. కానీ మంచి పదవి వరించినట్లు హర్షం వ్యక్తం చేస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయడంపై ప్రత్యేక కసరత్తు చేయాలని పార్టీ నేతలకు సూచిస్తున్నారు.
Also Read: ఏపీలో ఆస్తిపన్ను భారం మోపుతున్న ప్రభుత్వం
[…] […]
[…] […]