Homeఆంధ్రప్రదేశ్‌జగన్‌ తొందరగా మేల్కోవాల్సిందే..: లేదంటే మొదటికే మోసం

జగన్‌ తొందరగా మేల్కోవాల్సిందే..: లేదంటే మొదటికే మోసం

CM Jagan Mohan Reddy
కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. కానీ.. ఆ బడ్జెట్‌లో ఏపీ రాష్ట్రానికి ఒరిగింది మాత్రం ఏమీ లేదు. కేంద్ర పెద్దలు ఏపీకి హ్యాండ్‌ ఇచ్చారనే చెప్పాలి. దీంతో ఇప్పుడు ఏపీ జనంలో కేంద్రంపై విమర్శలు వస్తున్నాయి. వీధుల్లోకి వచ్చి నిరసనలు చేయకున్నా.. సెంచరీకి చేరుతున్న పెట్రోల్ డీజిల్ ధరలను చూసి గుస్సా అవుతున్నారు. రచ్చ చేయకున్నా.. సరైన సమయం చూసి కర్రు కాల్చి వాత పెట్టడానికి జనాలు రెడీగా ఉన్నారనేది వాస్తవం.

Also Read: మంత్రి నానిపై ఎస్‌ఈసీ సీరియస్‌..: కేసు నమోదు

ఏపీలో బీజేపీ చూస్తే నోటాతోనే పోటీ పడుతోంది తప్ప పట్టుమని పది శాతం ఓట్లు సొంతంగా ఎప్పుడూ సాధించిన దాఖలాలు లేవు. ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లోనూ ఏపీ మీద ఏమాత్రం ఆశలు లేవు అని క్లారిటీగా అర్థమైంది. కనీసం ఏపీని ఆకట్టుకుందామన్న ధ్యాస కూడా బీజేపీ పెద్దలకు లేదని బడ్జెట్ పద్దులను చూస్తే అర్థమవుతోంది. అందువల్ల ఏపీ జనాలు కోపంతో రగిలి పోతున్నారు.

ఏపీలో చంద్రబాబు అయిదేళ్ల పాలన మీద జనాలకు ఎంత వ్యతిరేకత ఉందో అందరికీ తెలిసిందే. కేంద్రంలోని బీజేపీతో నాలుగేళ్ల పాటు అంటకాగి ఏపీకి ఏమీ తేలేకపోయాడన్న జనాగ్రహమే 2019 ఎన్నికల్లో బాబుని చిత్తు చేసింది. అదే సమయంలో ప్రత్యేక హోదా సహా అనేక హామీలన్నీ కేంద్రం నుంచి సాధించుకుని వస్తానని జగన్ చెప్పడంతో ఆయనకు పట్టం కట్టారు. రెండు బడ్జెట్లు చూస్తే కేంద్రం వద్ద జగన్ పలుకుబడి బాబు కంటే కష్టంగా ఉందని ఈపాటికే తెలుస్తోంది. రెండు బడ్జెట్లు వెళ్లిపోయినా పైసా కూడా ఏపీకి రాలేదు. దాంతో జనాల కోపం ఇపుడు జగన్ మీదకు మెళ్లగా మళ్లుతోందని తెలుస్తోంది.

Also Read: ఏపీ బీజేపీ ఆశలను చిదిమేస్తున్న మోడీషాలు

నిజానికి బాబుకు, జగన్‌కు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. జగన్ కేంద్ర ప్రభుత్వంలో చేరలేదు. కేంద్రాన్ని పల్లెత్తు మాట కూడా అనడంలేదు. పైగా బేషరతుగా కేంద్రం ప్రవేశపెట్టే ప్రతీ బిల్లుకూ పార్లమెంట్‌లో జగన్ మద్దతు ఇస్తున్నారు. ఢిల్లీకి ఠంచనుగా నెలకు ఒకసారి వెళ్లి ఏకాంత చర్చలు జరిపివస్తున్నారు. వాటి వల్ల ఏపీకి దక్కింది సున్నా అని అందరికీ తెలుసు. మరి జగన్ దేనికి వెళ్తున్నాడు అంటే ఆయన కేసుల నుంచి రక్షించుకోవడానికే అని తెలుగుదేశం విపరీతంగా ప్రచారం చేస్తోంది. ఈ సమయంలో కనుక జగన్ మేలుకోకపోతే మాత్రం జనం బీజేపీ మీద ఉన్న కోపాన్ని జగన్ మీదకు మళ్లించడం ఖాయమని అంటున్నారు.

Check this Space For More information on Andhra Pradesh Political News

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular