
కరోనా కాస్త తగ్గుముఖం పట్టింది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య తగ్గుతోంది. దీంతో సెకండ్ వేవ్ కాస్త నెమ్మదించింది. ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది. బాధితులు సైతం తమ బతుకుపై భరోసా పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా కేసులు తగ్గుతున్నాయని సీఎం జగన్ చె ప్పారు. జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన విషయాన్ని గుర్తించాలని సూచించారు. పరిస్థితి ఇంకా మెరుగుపడాల్సి ఉందని పేర్కొన్నారు. స్పందన కార్యక్రమంలో భాగంగా జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమావేశమయ్యారు.
కొవిడ్ పో రాటంలో భాగంగా సిబ్బందికి అభినందనలు తెలిపారు. కరోనా పరిస్థితులపై ఉభయగోదావరి, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పె ట్టాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రైవేటు ఆస్పత్రులు కొవిడ్ నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తరుచూ తప్పులు చేస్తే ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చె ప్పారు.
104కు ఎవరైనా ఫోన్ చేస్తే తక్షణమే స్పందించాలని సీఎం సూచించారు.లేకుంటే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. మధ్యాహ్నం తర్వాత ప్రతి ఒక్కరూ కర్ఫ్యూ నిబంధనలు పాటించాలన్నారు. 45 పైబడిన వారికి వ్యాక్సినేషన్ పూర్తయ్యాక మిగతా వారికి ఇస్తామని పేర్కొన్నారు. మొదటి డోసు తీసుకుని రెండో డోసు కోసం వేచి చూస్తున్న వారికి ప్రాధాన్యం ఇస్తామని వివరించారు.
కరోనా నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు సహకరించాలని కోరారు. ఏదైనా అత్యవసరం అయితే స్పందించాలని సూచించారు. నిరంతరం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేయాలని హితవు పలికారు.