The sea closest to Rayalaseema : రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా? ఇప్పుడు అదే కరువు రాయలసీమకు సముద్రాన్ని తీసుకొచ్చాడు ఆ ప్రాంతంలోనే పుట్టిన బిడ్డ సీఎం జగన్. అవును నిజంగానే నిజం.. ఆకలి వేస్తే భూమి వైపు.. దాహం వేస్తే ఆకాశం వైపు దీనంగా చూసేలా ఒకప్పుడు రాయలసీమను కొన్నేళ్ల పాటు కరువు వెంటాడింది. దేశంలోనే అత్యంత శుష్క వర్షాలు పడని ప్రాంతంగా రాయలసీమ గుర్తింపు పొందింది. అక్కడి కొండలు, గుట్టలు.. మోడిబారిన నేలలు చూసి చాలా కన్నీటి పాటలు వెలువడ్డాయి.
కోస్తా ఆంధ్రా అంతా పచ్చగా ఉంటే మోడు వారిన బీడు పొలాలతో రాయలసీమ వెలవెలబోయేది. అయితే తాజాగా పునర్విభజనతో రాయలసీమకు కూడా సముద్ర తీరం వచ్చేసింది. అలా తెచ్చేశాడు సీఎం జగన్.
ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల విభజనతో రాయలసీమకు సముద్ర తీరం వచ్చేసింది. వివిధ జిల్లాల రూపు రేఖలు, లెక్కలు మారాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో కోస్తా, సీమ జిల్లాల లెక్కలూ మారనున్నాయి.
ఇన్నాళ్లు కోస్తా తీరంలోని 13 జిల్లాలు, రాయలసీమలోని 4 జిల్లాలు వేరుగా ఉండేవి. కానీ ఇప్పుడు జిల్లాల విభజనతో రాయలసీమకు జగన్ సముద్రతీరాన్ని తీసుకొచ్చాడు. అలా కలిపేశాడు.
నెల్లూరు జిల్లాలోని సముద్రతీరాన్ని ఆనుకొని ఉన్న సూళ్లూరుపేట నియోజకవర్గం తిరుపతికి దగ్గరగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఈనియోజకవర్గాన్ని తిరుపతి కేంద్రంగా ఏర్పడే ‘శ్రీబాలాజీ’ జిల్లాతో కలిపేసింది జగన్ సర్కార్. దీంతో రాయలసీమకు తీరప్రాంతం వచ్చినట్లైంది. ఈ కొత్త కలయికతో కరువు సీమకు కళ వచ్చినట్టైంది. సీమలో ఏర్పాటు చేసే మూడు కొత్త జిల్లాలకు శ్రీసత్యసాయి, శ్రీ బాలాజీ, అన్నమయ్య పేర్లు పెట్టి దైవ చింతన భక్తిభావం ఉప్పొంగేలా జగన్ ఆధ్యాత్మిక టచ్ ఇచ్చాడు.