Kamal Haasan: సీనియర్ హీరో కమల్ హాసన్ కి ప్రస్తుతం స్టార్ హీరోల రేంజ్ లో మార్కెట్ లేదు. ఎలాగూ సినిమాల్లో మార్కెట్ తగ్గింది కాబట్టి.. ఇక సైడ్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు కమల్. ఆ మధ్య వస్త్ర వ్యాపారం మొదలుపెట్టాడు. ఆ వ్యాపారంలోకి అడుగుపెట్టడానికి కారణం కమల్ కి వస్త్రాల పై మంచి పట్టు ఉండటమే. అయితే, కమల్ తన పేరు పై క్లోతింగ్ లేబిల్ ని లాంచ్ చేసి మొత్తానికి ఖద్దరు బట్టలు కూడా అమ్ముతూ ఫుల్ క్యాష్ చేసుకునే పనిలో పడ్డాడు.
నిన్న రిపబ్లిక్ డేని పురస్కరించుకొని ఒక వెబ్ సైట్ ని కూడా లాంచ్ చేశాడు. తన కంపెనీ ఖద్దరు దుస్తులు ఎవరికి కావాలనుకున్నా సరే.. వాళ్ళు ప్రపంచంలో ఎక్కడవున్నా సరే.. ఆ చోటుకి వెంటనే డెలివరీ కూడా చేస్తామని కమల్ హాసన్ తన బట్టల దుకాణాన్ని బాగా ప్రమోట్ చేసుకుంటున్నాడు. కాకపోతే కమల్ హాసన్ బట్టలను బుక్ చేసుకోవాలి అంటే. కాస్త పెద్ద మొత్తంలోనే సమర్పించుకోవాలి.
Also Read: వెంకటేశ్ వదులుకుంటేనే బాలయ్యకి అదృష్టం పట్టింది
ఇక ఈ బట్టల వ్యాపారంలో విజయ్ దేవరకొండ, సమంతలతో సహా పలువురు హీరోలు, హీరోయిన్లు కూడా ఉన్నారు. ఐతే, కమల్ హాసన్ వస్త్ర వ్యాపారం మాత్రం కాస్త ప్రత్యేకమే అని చెప్పాలి. ఎందుకంటే.. కమల్ మగ్గాలపై నేసిన చేనేత వస్త్రాలనే మాత్రమే అమ్ముతున్నాడు. పైగా సింథటిక్ రంగులు లాంటివి అసలు వాడరు. అంటే.. పూర్తిగా నేచురల్ డైయింగ్ తో తన బట్టలను రెడీ చేస్తున్నాం అని కమల్ చెబుతున్నాడు.
అందుకే, కమల్ హాసన్ తన దుస్తుల బ్రాండ్ ని సీరియస్ గా ప్రమోట్ చేస్తున్నాడు. మొత్తానికి ఈ వ్యాపారంలో కమల్ బిజీగా ఉన్నారు మరోవైపు, కమల్ ప్రస్తుతం ‘విక్రమ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. అలాగే ఈ యూనివర్సల్ హీరోలో హీరోనే కాదు, మంచి నిర్మాత కూడా ఉన్నాడు. ఐతే.. ప్రస్తుతం శివ కార్తికేయ నటించే తదుపరి సినిమాను కమల్ హాసనే నిర్మించబోతున్నాడు.
కాగా సోనీ పిక్చర్స్‌తో కలిసి కమల్ కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించబోతుంది. అన్నట్టు ఈ సినిమాను రాజ్‌కుమార్ పెరియస్వామి డైరెక్ట్ చేయబోతున్నాడు. రాజ్‌కుమార్ పెరియస్వామి మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్. ఇక ఈ సినిమాలో కమల్ కూడా ఓ కీలక పాత్రలో నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు.
Also Read: ఈ వంటింటి చిట్కాలతో ఒమిక్రాన్ నుంచి త్వరగా కోలుకుంటారు..