Jagan Sketch On Chandrababu Arrest: తనను ఆదినుంచి ముప్పుతిప్పలు పెడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు పంపేందుకు భారీ స్కెచ్ నడుస్తోందా? ఎలాగైనా జైలు మెట్లెక్కించడానికి ఏపీ సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారా? సరిగ్గా హైకోర్టుకు సెలవుల నేపథ్యంలో అరెస్ట్ కు రంగం సిద్ధం చేస్తున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం వస్తోంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలు సాకుగా చూపుతూ చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ సైతం రూపొందించారు. అందులో పలు అంశాలను ప్రస్తావించారు.
వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబును జైలుకు పంపించాలని చాలాసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. దీనికి కారణం లేకపోలేదు. తనపై అక్రమాస్తుల కేసులకు చంద్రబాబు అండ్ కో కారణమని సీఎం జగన్ భావిస్తూ వచ్చారు. అప్పట్లో ఉన్న యూపీఏ ప్రభుత్వం కనుసన్నల్లో జరిగినా.. దాని వెనుక ఉన్నది మాత్రం చంద్రబాబేనని జగన్ భావించారు. ఒక విధంగా చెప్పాలంటే సోనియా గాంధీ కంటే చంద్రబాబుపైనే జగన్ పగ, ప్రతీకారాన్ని పెంచుకున్నారు. ఎప్పటికప్పుడు అవకాశం కోసం ఎదురుచూస్తూ వచ్చారు. కానీ 2014 ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రావడంతో వీలుపడలేదు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వం లూప్ హోల్స్ ను వెతుకుతూ వచ్చింది. చంద్రబాబు ఎక్కడైనా అవినీతికి పాల్పడి ఉంటారని ప్రత్యేక అధికారుల బృందంతో పెద్ద మేథోమథనమే చేశారు. కానీ ఎక్కడా ఎటువంటి లోపాలు బయటపడలేదు. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు ముందుగానే అన్నిరకాల జాగ్రత్తలు పడ్డారని పోలిటికల్ వర్గాల్లో టాక్ నడిచింది. అమరావతి, పోలవరంలో భారీ అవినీతికి పాల్పడ్డారని తొలుత హడావుడి చేశారు. కానీ ఎక్కడా నిరూపించలేకపోయారు. `ల్యాంగ్ ఫూలింగ్ కేసుల్లో అవినీతి నిరూపించలేక చతికిలపడ్డారు.
Also Read: Jagan cousin arrest: సంచలనం.. ఏపీ సీఎం జగన్ కజిన్ అరెస్ట్.. అసలేం జరిగింది?
-తెరపైకి ఇన్నర్ రింగ్ రోడ్డు..
ఇప్పుడు తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన బుర్రకు పదునుపెట్టారు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ విషయంలో మార్పుచేర్పులు చేశారని దీని వల్ల సాధారణ ప్రజలకు నష్టం జరిగిందని.. ఇతరులు లబ్ది పొందారని ఆయన ఫిర్యాదు చేశారు. ఏ కేసులో అయినా తాము నష్టపోయామని బాధితులు కేసులు పెడుతూ ఉంటారు. కానీ అమరావతి కేసుల్లో మాత్రం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ కేసులు నమోదయ్యాయి. ఈ ఐఆర్ఆర్ అలైన్‌మెంట్ ఖరారులో అవినీతి జరిగిందని.. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఒక్క రైతు కూడా ఫిర్యాదు చేయలేదు. కానీ ఎమ్మెల్యే మాత్రం సామాన్యులకు … ప్రజల ఆస్తులకు నష్టం చేకూర్చారని ఫిర్యాదు చేశారు. ఎవరికి నష్టం చేశారు…? ఎలా నష్టపోయారు? అన్న అంశాలు ఎఫ్ఐఆర్‌లో లేవు. సీఐడీ పోలీసులు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారని.. ప్రాథమిక దర్యాప్తు నిర్వహించామని.. ఆ దర్యాప్తులో ఆధారాలున్నాయని కేసులు పెట్టామని ఎఫ్ఐఆర్‌లో చెప్పారు. అయితే ఇప్పటికే చంద్రబాబుపై అమరావతి విషయంలో అభియోగాలు మోపి నిరూపించలేకపోయారని.. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుందని తెలుగుదేశం నాయకులు భావిస్తున్నారు. కానీ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో చంద్రబాబును ఎలాగైనా అరెస్ట్ చేసి జైలుకు పంపించే ఎత్తుగడగా అనుమానిస్తున్నారు., చంద్రబాబుకు నోటీసు ఇవ్వకుండా పక్కా ప్రణాళికతో అరెస్ట్ చేస్తారని పొలిటికల్ వర్గాల్లో చర్చ అయితే నడుస్తోంది.
-ప్రజలను డైవర్ట్ చేసేందుకు..
ప్రస్తుతం టీడీపీ, జనసేనల మధ్య రాజకీయ పొత్తు అనుకూల వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల మధ్య దాదాపు ఒక అవగాహనకు వచ్చినట్టు సంకేతాలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇరు పార్టీల కలయిక వెనుక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. తటస్థులు, మేథావులు సైతం వారి కలయికను ఆసక్తిగా గమనిస్తున్నారు. అలయెన్స్ లో భాగం కావాలని భావిస్తున్నారు. అయితే ఈ సానుకూల పరిస్థితి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రభుత్వం చంద్రబాబు అరెస్టుకు ప్రయత్నిస్తుందన్న అనుమానాలు ఉన్నాయి. ఒక వేళ చంద్రబాబును అరెస్ట్ చేసినా న్యాయపరంగా ముందుకెళ్లే అనేక మార్గాలున్నాయని.. అత్యవసర విచారణకు సైతం విన్నవించే అవకాశముందని న్యాయనిపుణులు చెబుతున్నారు. కానీ చేతిలో పోలీసులు ఉన్నారు.. వ్యవస్థలన్నీ మా చేతిలో ఉన్నాయంటూ వైసీపీ ప్రజాప్రతినిధులు అహంతో ముందుకెళ్తే చుక్కెదురు కావడం ఖాయమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Also Read:APSRTC: ప్రభుత్వంలో విలీనమైనా.. కోలుకోలేకపోతున్న ఏపీఎస్ ఆర్టీసీ
Recommended Videos: