https://oktelugu.com/

APSRTC: ప్రభుత్వంలో విలీనమైనా.. కోలుకోలేకపోతున్న ఏపీఎస్ ఆర్టీసీ

APSRTC: ఆర్టీసీలో ప్రయాణం సుఖం, సురక్షితం, శుభప్రదం.. ఇది దశాబ్దాలుగా వినిపిస్తున్న స్లోగన్. కానీ ప్రయాణికులను మాత్రం ఆకర్షించుకోలేకపోతోంది. ఈ నినాదం. ఏపీలో ప్రభుత్వంలో విలీనమైన ఆశించిన పరిణితి కనబరచలేకపోతోంది. పాలకుల కరుణలేక.. కాలంతీరిన బస్సులతో ప్రయాణికులను దూరం చేసుకుంటోంది. గతంలోనూ కష్టనష్టాలు వెంటాడగా.. ప్రభుత్వంలో విలీనమైతే పరిస్థితి మెరుగుపడుతుందనుకుంటే.. మరింత దిగజారిపోతోంది. కొత్తబస్సుల కోసం ప్రతిపాదిస్తే.. జీతాలిస్తున్నాం కదా.. అని సాక్షాత్తూ ప్రభుత్వ పెద్దే వ్యాఖ్యానించడంపై సంస్థ అధికారులు బిత్తరపోతున్నారు.ప్రస్తుతం రాష్ట్రంలోని 26జిల్లాల్లో 128బస్‌ డిపోల […]

Written By:
  • Dharma
  • , Updated On : May 11, 2022 / 08:28 AM IST
    Follow us on

    APSRTC: ఆర్టీసీలో ప్రయాణం సుఖం, సురక్షితం, శుభప్రదం.. ఇది దశాబ్దాలుగా వినిపిస్తున్న స్లోగన్. కానీ ప్రయాణికులను మాత్రం ఆకర్షించుకోలేకపోతోంది. ఈ నినాదం. ఏపీలో ప్రభుత్వంలో విలీనమైన ఆశించిన పరిణితి కనబరచలేకపోతోంది. పాలకుల కరుణలేక.. కాలంతీరిన బస్సులతో ప్రయాణికులను దూరం చేసుకుంటోంది. గతంలోనూ కష్టనష్టాలు వెంటాడగా.. ప్రభుత్వంలో విలీనమైతే పరిస్థితి మెరుగుపడుతుందనుకుంటే.. మరింత దిగజారిపోతోంది. కొత్తబస్సుల కోసం ప్రతిపాదిస్తే.. జీతాలిస్తున్నాం కదా.. అని సాక్షాత్తూ ప్రభుత్వ పెద్దే వ్యాఖ్యానించడంపై సంస్థ అధికారులు బిత్తరపోతున్నారు.ప్రస్తుతం రాష్ట్రంలోని 26జిల్లాల్లో 128బస్‌ డిపోల పరిధిలో 10,328 బస్సులు రోజూ 41.81లక్షల కిమీ మేర తిరుగుతున్నాయి. వాటిలో 24గంటలపాటు 28.97లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుకొంటున్నారు.

    APSRTC

    70శాతం ఆక్యుపెన్సీతో ఆర్టీసీ గత నెలలో 416కోట్ల రూపాయలు ఆర్జించింది. అయినా ఇప్పుడున్న డీజిల్‌ ధరలు, బస్సుల నిర్వహణ, సిబ్బంది జీతాలు, అప్పులకు వడ్డీలు లెక్కిస్తే సరిపోదు. గత ప్రభుత్వంలో తరచూ కొత్త బస్సులు కొనుగోలు చేసే ఆర్టీసీ రోజుకు 11వేలకు పైగా బస్సులు తిప్పేది. సరిగ్గా మూడేళ్ల క్రితం అంటే 2019 ఏప్రిల్‌లో కండీషన్‌ ఉన్న బస్సుల్లో రోజుకు 35.81లక్షల మంది ప్రయాణించేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 30.53లక్షలకు పడిపోయి ఆ సంఖ్య ఏకంగా ఐదున్నర లక్షలు తగ్గిపోయింది. ఇక బస్సుల విషయానికి వస్తే.. 10,967బస్సులు రోజుకు సరాసరి 87శాతం ఆక్యుపెన్సీతో 44.26లక్షల కిమీ తిరిగేవి. ఇప్పుడు బస్సులూ తగ్గాయి, ఆక్యుపెన్సీ కూడా 70శాతానికి పడిపోయింది. అప్పట్లో ప్రయాణ టికెట్‌ చార్జీలు తక్కువగా ఉన్నా రోజుకు రూ.14.33కోట్ల చొప్పున నెలకు రూ.430కోట్లకుపైగా ఆదాయం వచ్చేది. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు సార్లు చార్జీలు పెంచినా రోజుకు 14కోట్ల చొప్పున నెలకు 416కోట్లకు పడిపోయింది.

    Also Read: Jagan cousin arrest: సంచలనం.. ఏపీ సీఎం జగన్ కజిన్ అరెస్ట్.. అసలేం జరిగింది?

    అక్యుపెన్సీ ఏదీ?
    ఆర్థిక ఇబ్బందులు, అప్పుల నుంచి బయట పడాలంటే ఆదాయం పెరగాలి.. అలా జరగాలంటే ఆక్యుపెన్సీ పెంచుకోవాలి.. ప్రజల అభిరుచులకు అనుగుణంగా ప్రయాణ సేవలందిస్తేనే ఆదరణ పెరుగుతుంది.. కొత్త బస్సులు కొనుగోలు చేసి సమయపాలన పాటిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేరిస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి.. అప్పుడే ఆర్టీసీ లాభాల బాట పట్టే అవకాశం ఉంది.. కానీ వైసీపీ సర్కారు మూడేళ్లుగా బడ్జెట్‌లో కేటాయిస్తున్న నిధులు విడుదల చేయకపోవడంతో కొత్త బస్సులు కొనే స్థోమత ఆర్టీసీకి లేదని యాజమాన్యం నిస్సహాయత వ్యక్తం చేస్తోంది. అద్దె బస్సులు కాకుండా ఆర్టీసీలో ప్రస్తుతం సొంత బస్సులు 9వేలు మాత్రమే ఉన్నాయి. వాటిలో నాలుగు వేల బస్సుల వరకూ పన్నెండు లక్షల కిలో మీటర్లకు పైగా తిరిగి దాదాపు గుజిరీ దశకు చేరుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం రెండు వేల బస్సులు కొనుగోలు చేసి ప్రయాణికుల ఆదరణ పొందాల్సి ఉంది. అంత ఆర్థిక స్థోమత ఆర్టీసీకి లేదని యాజమాన్యం చెబుతోంది.

    APSRTC

    కానరాని బడ్జెట్ కేటాయింపులు
    బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కొత్త బస్సులకు కేటాయించిన జగన్‌ ప్రభుత్వం నిధులు విడుదల చేసి ఆర్టీసీని ఆదుకోవాలి. కానీ గడిచిన రెండేళ్లలో ఆ పని జరగలేదు. ఆర్టీసీ చైర్మన్‌ మల్లికార్జున రెడ్డి అంతర్గత సంభాషణల్లో మాట్లాడుతూ.. సీఎం దగ్గరికెళ్లి కొత్త బస్సుల కొనుగోలుకు డబ్బులు అడిగితే.. జీతాలు ఇస్తున్నా కదా.. అని బదులిచ్చినట్లు వ్యాఖ్యానించారు. దీంతో అద్దె బస్సులు కొత్తవి తీసుకుని ప్రయాణికులు దూరం కాకుండా ఆర్టీసీ యాజమాన్యం జాగ్రత్త పడింది. కానీ కండీషన్లన్నీ ఏకపక్షంగా ఉండ టం, ఒప్పందం లాభదాయంగా లేకపోవడంతో టెండర్లు వేసేందుకు 20శాతం మం ది కూడా ముందుకు రాలేదు. దీంతో మరో 15రోజులు గడువు పొడిగించిన ఆర్టీసీ అద్దె బస్సుల టెండర్ల కోసం ఎదురు చూస్తున్నారు.

    Also Read:S. V. Ranga Rao Rare Photo: ‘ఎస్వీఆర్’ చిన్ననాటి ఫోటో.. వావ్ అచ్చం ‘విజయ్ దేవరకొండ’లా ఉన్నాడు

    Recommended Videos:

    Tags