CM Jagan Amaravati Capital Issue: ఏపీలో ఇప్పుడు మూడు రాజధానుల విషయంలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. మొదటి నుంచి తమది మూడు రాజధానుల సిద్ధాంతమే అని బల్ల గుద్ది చెబుతున్న వైసీపీ.. ఈ విషయంలో మాత్రం అస్సలు వెనక్కు తగ్గట్లేదు. ఈ మధ్యనే కేంద్రం అమరావతినే రాజధానిగా గుర్తించింది. ఆ తర్వాత హై కోర్టు కూడా అమరావతినే రాజధాని అని చెప్పేసింది. ఒకసారి చేసిన చట్టాన్ని ఎలా రద్దు చేస్తారంటూ ప్రశ్నించింది.

పైగా రైతులుకు ప్లాట్లు డెవలప్ చేసి ఇవ్వాలని, రిట్ ఆఫ్ మాండమాస్ తీర్పును ఇచ్చేసింది. ఇంత స్పష్టంగా హై కోర్టు తన తీర్పును వెల్లడించిన తర్వాత కూడా.. వైసీపీ మాత్రం మూడు రాజధానులు కట్టి తీరుతామని శపథాలు చేస్తోంది. కోర్టు తీర్పుపై ఇప్పటికే వైసీపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇక్కడే వైసీపీ ఓ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇప్పుడు ఏపీలో జగన్ పాలన మీద వ్యతిరేకత మొదలైంది. కేవలం సంక్షేమ పథకాలు తప్ప మరే అభివృద్ధి లేదు. పైగా పెరుగుతున్న పన్ను వసూళ్లు, ధరలు మధ్యతరగతి ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లో నెట్టేస్తున్నాయి. ఓటీఎస్ అంటూ ప్రభుత్వం చేస్తున్న వసూల్లపై జనాలు తిరగబడుతున్నారు. కాబట్టి ఇలాంటి సమయంలో తమ పాలన మీద ప్రజల్లో, మీడియాలో చర్చ జరిగితే అది తమకే నష్టం అని జగన్ భావిస్తున్నారంట.

కాబట్టి మూడు రాజధానులపై అటు ప్రజల్లోనూ, ఇటు ప్రతిపక్షాల్లోనూ చర్చ జరిగితే ఆటోమేటిక్ గా తాము సేఫ్ అవుతామని ప్లాన్ వేస్తున్నారంట వైసీపీ నేతలు. ఇందులో భాగంగానే కోర్టు తీర్పును కూడా తప్పు బడుతూ.. మూడు రాజధానులు కట్టి తీరుతామంటున్నారు. ఇక త్వరలోనే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని సంకేతాలు ఇస్తున్నారు. ఇలా ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇదో వ్యూహంలా వారికి మారిపోయింది. జగన్ అనుకున్నట్టు మూడు రాజధానులు సాధ్యం అయినా కాకపోయినా.. మళ్లీ ఎన్నికలు వచ్చే దాకా దీని మీద రగడ సాగించి.. ఓట్లు కొల్లగొట్టాలన్నదే ఆయన వ్యూహంలా తెలుస్తోంది.
[…] Also Read: మూడు రాజధానుల అంశాన్ని అలా వాడేస్త… […]
[…] […]