పథకాలు ఎందరో పెడుతుంటారు.. కానీ ప్రజలకు ఉపయోగపడేవి.. క్షేత్రస్థాయిలో వారికి మేలు చేసేవి కొందరే పెడుతారు.. ఆ కొందరిలో ఒక్కడిగా నిలిచిపోవాలని ఏపీ సీఎం జగన్ డిసైడ్ అయ్యారు.
ప్రజల కష్టాలు తీర్చేందుకు జగన్ ‘స్పందించాడు’. ‘స్పందన’ అనే పోర్టల్ ను తాజాగా ప్రారంభించాడు. ప్రజా సమస్యల కోసం కలెక్టర్లకు, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఇక ఆన్ లైన్ లోనే స్పందన పోర్టల్ ను జగన్ తెరిచాడు.
ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదులు చేస్తే నిర్ణీత గడువు లోగా వారికి సమాధానం ఇవ్వాలి.. తిరస్కరిస్తే కారణాన్ని చూపాలి. ఇలా అధికారులను జవాబుదారి చేసేలా జగన్ ఈ కొత్త ‘స్పందన ’ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టారు.
‘స్పందన’ అనే కొత్త పోర్టల్ ను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదు చేయవచ్చు. ఇచ్చిన దరఖాస్తు ఏ స్థాయిలో ఉందనే విషయాన్ని తెలుసుకోవచ్చు. స్పందనలో నమోదైన ఫిర్యాదును ఎందుకు తిరస్కరిస్తున్నారో ఖచ్చితంగా చెప్పాలని.. ఫిర్యాదు పరిష్కారం కాకపోతే ఏ స్థాయిలో నిలిచిపోయిందనే విషయం కూడా తెలియజేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.
ఇక పట్టాల సమస్యలకు జగన్ చెక్ చెప్పారు. దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో ఇంటి పట్టా ఇవ్వాలని జగన్ అధికారులకు స్పష్టం చేశారు. ఇలా ప్రజలకు చేరువయ్యే పథకాలతో జగన్ దూసుకుపోతున్నారు. ‘స్పందన ’ పోర్టల్ కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.