https://oktelugu.com/

AP CM Jagan: ఏపీలో వరద.. సీఎం జగన్ పెళ్లిళ్లలో సరదా?

AP CM Jagan:  ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. ఇంకేదో కాలి ఇంకొకడు ఏడుస్తున్నాడట.. వెనుకటికి ఈ సామెత బాగా పాచుర్యంలోకి వెళ్లింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ధాటికి దక్షిణాంధ్ర అతలాకుతలమైంది. కరువు సీమ రాయలసీమ ‘కన్నీటి’సంద్రమైంది. కరువుతో అల్లాడే సీమ జిల్లాల్లో ఏకంగా ఊళ్లకు ఊళ్లు, బ్రిడ్జిలు, మనుషులు కొట్టుకుపోయేంతగా వర్షం పడిందంటే ఏంత భీభత్సమో అర్థం చేసుకోవచ్చు. అంతటి భయానక పరిస్థితులను ఎదుర్కొంటున్న ఏపీలో దగ్గరుండి పనులు పర్యవేక్షించాల్సిన ఏపీ సీఎం జగన్ కులాసాగా […]

Written By:
  • NARESH
  • , Updated On : November 22, 2021 / 12:09 PM IST
    Follow us on

    AP CM Jagan:  ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. ఇంకేదో కాలి ఇంకొకడు ఏడుస్తున్నాడట.. వెనుకటికి ఈ సామెత బాగా పాచుర్యంలోకి వెళ్లింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ధాటికి దక్షిణాంధ్ర అతలాకుతలమైంది. కరువు సీమ రాయలసీమ ‘కన్నీటి’సంద్రమైంది. కరువుతో అల్లాడే సీమ జిల్లాల్లో ఏకంగా ఊళ్లకు ఊళ్లు, బ్రిడ్జిలు, మనుషులు కొట్టుకుపోయేంతగా వర్షం పడిందంటే ఏంత భీభత్సమో అర్థం చేసుకోవచ్చు.

    ap cm jagan

    అంతటి భయానక పరిస్థితులను ఎదుర్కొంటున్న ఏపీలో దగ్గరుండి పనులు పర్యవేక్షించాల్సిన ఏపీ సీఎం జగన్ కులాసాగా పక్కరాష్ట్రంలోని స్పీకర్ కూతురు పెళ్లికి వెళ్లడం విమర్శలకు తావిచ్చింది. అరే ఏపీ దక్షిణాంధ్ర ప్రజలు వరద బీభత్సంతో ప్రాణాలు పోతుంటే.. సాయం కోసం అరుస్తుంటే సీఎం జగన్ ఇవేవీ పట్టకుండా తన మానాన తను సరదాల కోసం పెళ్లిళ్లకు వెళ్లడంపై బాధితులు మండిపడుతున్నారు.

    ఏపీలో వాన దెబ్బకు ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోయాయి. మనుషులు గల్లంతయ్యారు. బ్రిడ్జిలు తెగిపోయాయి. వరద ఇప్పటికీ భయపెడుతోంది. రోడ్లు భారీగా ధ్వంసమయ్యాయి. 16వ జాతీయ రహదారిపై రాకపోకలకు ఆటంకం కలిగింది. తిరుపతిలోని రాయల చెరువుకు గండి పడింది. కట్టుబట్టలతో పునరావాస ప్రాంతాలకు బాధితులు అన్నమో రామచంద్ర అంటూ వలస వెళుతున్నారు. 4 జిల్లాల్లో 1366 గ్రామాలపై తీవ్ర ప్రభావం పడింది.

    నెల్లూరు జిల్లాలో 44275 మంది సహాయ శిబిరాలకు తరలించారు. వరి, మెట్ట పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వందల చెరువులకు గండ్లు పడి గ్రామాలకు గ్రామాలు వరద ముప్పు పొంచి ఉంది. కడప జిల్లా పాపఘ్ని నదిపై వంతెన కుప్పకూలింది. ఇప్పటికీ వాన వదలడం లేదు. వరద నష్టం అంతకంతకూ పెరుగుతోంది. వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వేల కోట్ల నష్టం వాటిల్లింది.

    వీటన్నింటిని సమీక్షించి కేంద్రానికి తెలిపి నిధులు తేవడమో.. తక్షణం సహాయం చేయడమో సీఎం జగన్ చేయాలి. కానీ ఇవేవీ పట్టకుండా వరదల వేళ తెలంగాణ స్పీకర్ కూతురు పెళ్లికి వెళ్లి సీఎం జగన్ తో కలిసి విందులు, వినోదాల్లో మునిగితేలడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో వరద వస్తుంటే జగన్ పెళ్లిళ్ల సరదా చేస్తున్నాడా? అని బాధితులు మండిపడుతున్నారు.