https://oktelugu.com/

Railway Jobs: రైల్వేలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

Railway Jobs: సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. వివిధ వర్క్ షాపులలో వేర్వేరు అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ సిద్ధమైంది. మొత్తం 1785 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయని తెలుస్తోంది. మెషినిస్ట్, పెయింటర్, కేబుల్‌ జాయింటర్‌, ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెకానిక్, ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. Also Read: నిరుద్యోగులకు అలర్ట్.. ప్రముఖ రియల్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 24, 2021 4:00 pm
    Follow us on

    Railway Jobs: సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు అందించింది. వివిధ వర్క్ షాపులలో వేర్వేరు అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ సిద్ధమైంది. మొత్తం 1785 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయని తెలుస్తోంది. మెషినిస్ట్, పెయింటర్, కేబుల్‌ జాయింటర్‌, ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెకానిక్, ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

    Also Read: నిరుద్యోగులకు అలర్ట్.. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలో 1,000 జాబ్స్?

    Railway Jobs

    Railway Jobs

    పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. https://rrcser.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను సులభంగా నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెకానిక్, మెషినిస్ట్, పెయింటర్, కేబుల్‌ జాయింటర్‌ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

    ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లు ఖరగ్‌పూర్‌ వర్క్‌షాప్, సిగ్నల్‌ అండ్‌ టెలికామ్‌ వర్క్‌షాప్, ట్రాక్‌ మెషిన్‌ లలో పని చేయాల్సి ఉంటుంది. 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. అకడమిక్ మెరిట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల ఎంపిక జరుగుతుంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పవచ్చు.

    నిరుద్యోగులకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు అర్హతకు తగిన వేతనం లభించనుంది.

    Also Read: అనంతపూర్ డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌లో జాబ్స్.. ఎలా ఎంపిక చేస్తారంటే?